AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ఫ్యాన్స్‎కి గుడ్ న్యూస్.. రూ.799 అవసరం లేదు.. జస్ట్ రూ.24లకే లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను కేవలం రూ.24 అదనపు ఖర్చుతో హెచ్‌డీ క్వాలిటీలో చూడొచ్చని ఫుట్‌బాల్ అభిమానులు గుర్తించిన లీగల్ ట్రిక్ వైరల్ అవుతోంది. ఎయిర్‌టెల్ బ్లాక్ బాక్స్, యునైట్8 స్పోర్ట్స్ ఛానెల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను ఆస్వాదించవచ్చు.

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ఫ్యాన్స్‎కి గుడ్ న్యూస్.. రూ.799 అవసరం లేదు.. జస్ట్ రూ.24లకే లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jun 20, 2026 | 7:32 AM

Share

FIFA World Cup 2026 : నాలుగేళ్లుగా ఫిఫా వరల్డ్ కప్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు ఈసారి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ పెద్ద షాక్ ఇచ్చింది. టోర్నమెంట్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సరికొత్త ప్లాట్‌ఫారమ్.. మ్యాచ్ టైమింగ్స్ లో వస్తున్న లోడింగ్ సమస్యల వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. రూ.799 పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులకు కూడా అర్ధరాత్రి మ్యాచ్ చూసేటప్పుడు స్క్రీన్ స్తంభించిపోతోంది. పైగా పైరసీని అడ్డుకోవాలనే నిబంధనలతో డెస్క్‌టాప్ బ్రౌజర్లలో క్వాలిటీని కేవలం 480pకి పరిమితం చేయడంతో లయనల్ మెస్సి మ్యాజిక్, క్రిస్టియానో రోనాల్డో ఆటను క్లియర్ గా చూడలేక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

ఈ డిజిటల్ తలనొప్పులన్నింటికీ చెక్ పెడుతూ కొందరు స్మార్ట్ ఫ్యాన్స్ ఒక అద్భుతమైన లీగల్ ట్రిక్ ను కనిపెట్టారు. ఎలాంటి దొంగ ఐపీటీవీ యాప్స్ లేదా వీపీఎన్ లతో సంబంధం లేకుండా.. కేవలం రూ.23.60 లకే పూర్తి టోర్నమెంట్‌ను లీనియర్ టెలివిజన్ నెట్‌వర్క్ ద్వారా హై డెఫినిషన్ క్వాలిటీలో చూస్తున్నారు. ఇటీవల స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన జీ (Zee) నెట్‌వర్క్ తన సరికొత్త లీనియర్ ఛానెళ్ల ధరలను చాలా తక్కువగా నిర్ణయించడమే దీనికి ప్రధాన కారణం.

ఈ ట్రిక్ వెనుక ఉన్న అసలు లెక్కలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. జీ నెట్‌వర్క్ తెచ్చిన సరికొత్త స్పోర్ట్స్ ఛానెళ్ల బేస్ ప్రైస్ పై 18 శాతం జీఎస్టీని కలిపినా కూడా చాలా తక్కువ మొత్తం అవుతుంది. ఇందులో హిందీ కామెంటరీ ఇచ్చే Unite8 Sports 1 HD బేస్ ధర రూ.9 కాగా, పన్నులతో కలిపి రూ.10.62 అవుతుంది. అలాగే ఇంగ్లీష్ కామెంటరీ అందించే Unite8 Sports 2 HD బేస్ ధర రూ.11 కాగా, పన్నులతో కలిపి రూ.12.98 అవుతుంది. ఈ రెండు ఛానెళ్లను కలిపితే నెలకు కేవలం రూ.23.60 మాత్రమే ఖర్చవుతుంది.

అయితే ఈ సదుపాయాన్ని పొందడానికి ఒక చిన్న కండిషన్ ఉంది. చాలామంది పట్టణ ప్రాంతాల్లో నివసించే భారతీయులు తమ ఇళ్లలో హై-స్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్ కోసం ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్లను వాడుతున్నారు. కానీ, ఈ ప్లాన్ తో పాటు ఉచితంగా లభించే టీవీ కనెక్షన్, హైబ్రిడ్ ఐపీటీవీ బ్లాక్ బాక్స్ గురించి వారికి కనీస అవగాహన లేదు. వైఫై రూటర్ వెనుక ధూళి పేరుకుపోయి పడి ఉన్న ఆ బ్లాక్ బాక్స్ ను దుమ్ము దులిపి బయటకు తీస్తే చాలు.. ఎటువంటి డిష్ యాంటెన్నాను గోడకు డ్రిల్లింగ్ చేసే పని లేకుండా కేవలం మీ వైఫై వైర్ సాయంతోనే టీవీ స్క్రీన్ పై వరల్డ్ కప్ ప్రత్యక్ష ప్రసారాలు ప్రత్యక్షమవుతాయి.

అందుబాటులో ఉన్న వివిధ ఎయిర్‌టెల్ ప్లాన్ల వివరాలు

ఒకవేళ మీరు ఇప్పటికే స్టాండలోన్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతుంటే, దానిని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ కిందకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ప్రామాణిక ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.699 ప్లాన్: 40 Mbps వైఫై ఇంటర్నెట్ + 350 కి పైగా ఛానెళ్లతో కూడిన డీటీహెచ్/ఐపీటీవీ బాక్స్.

రూ.899 ప్లాన్: 100 Mbps వైఫై ఇంటర్నెట్ + 350 కి పైగా ఛానెళ్లతో కూడిన డీటీహెచ్/ఐపీటీవీ బాక్స్.

రూ.1599 ప్లాన్: 300 Mbps వైఫై ఇంటర్నెట్ + 350 కి పైగా ఛానెళ్లతో కూడిన డీటీహెచ్/ఐపీటీవీ బాక్స్.

రూ.3999 ప్లాన్: 1000 Mbps అల్ట్రా వైఫై ఇంటర్నెట్ + 350 కి పైగా ఛానెళ్లతో కూడిన డీటీహెచ్/ఐపీటీవీ బాక్స్.

ఈ రూ.24 హ్యాక్ ను ఎలా యాక్టివేట్ చేయాలి?

ఈ అద్భుతమైన పద్ధతిని యాక్టివేట్ చేయడం చాలా సులభం. మొదటి స్టెప్ లో మీ మొబైల్ లోని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఓపెన్ చేసి, మీ ఇంటర్నెట్ ప్లాన్ ను అప్‌గ్రేడ్ టు ఎయిర్‌టెల్ బ్లాక్ ద్వారా ఇంటర్నెట్ + టీవీ బండిల్‌గా మార్చుకోండి. రెండవ స్టెప్ లో ఒకవేళ మీ వద్ద బాక్స్ లేకపోతే, కంపెనీ టెక్నీషియన్ 24 గంటల్లో మీ ఇంటికి వచ్చి బాక్స్ ఇన్స్టాల్ చేసి వైఫై కి కనెక్ట్ చేస్తారు. మూడవ స్టెప్ లో యాప్ లోని టీవీ/డీటీహెచ్ సెక్షన్ లోకి వెళ్లి మేనేజ్ ఛానెల్స్ ఆప్షన్ ద్వారా యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డీ (ఛానెల్ నంబర్ 301), యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీ (ఛానెల్ నంబర్ 303) సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి. అంతే, ఈ అదనపు రూ.23.60 ఖర్చు మీ తదుపరి నెల బిల్లులో యాడ్ అవుతుంది. ఎలాంటి అదనపు నగదు చెల్లించకుండా మీ ఇంట్లోనే కూర్చుని స్టేడియం లాంటి అనుభూతిని ఆస్వాదించండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us