AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: అక్షర్ పటేల్‌పై వేటు.. పంత్ ఎంట్రీతో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Delhi Capitals New Captain: ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటున్న ఈ సరికొత్త నిర్ణయాలు ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేఎల్ రాహుల్ సారథ్యం, రిషభ్ పంత్ రాకపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ భారీ మార్పులైనా ఢిల్లీ జట్టు తలరాతను మార్చి, రాబోయే సీజన్లో వారిని ఛాంపియన్లుగా నిలబెడతాయో లేదో చూడాలి.

IPL 2027: అక్షర్ పటేల్‌పై వేటు.. పంత్ ఎంట్రీతో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్‌ ఎవరంటే?
Delhi Capitals
Venkata Chari
|

Updated on: Jun 19, 2026 | 9:31 PM

Share

Delhi Capitals New Captain: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు సరికొత్త షాక్ తగిలింది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాబోయే సీజన్ కోసం ఒక పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. అక్షర్ పటేల్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి, టీమిండియా మేటి ఓపెనర్, అత్యంత అనుభవజ్ఞుడైన సీనియర్ ఆటగాడికి జట్టు పగ్గాలను అప్పగించేందుకు యాజమాన్యం అంతా సిద్ధం చేసింది.

కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ పగ్గాలు.. తెరపైకి క్రేజీ అప్‌డేట్!

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మేనేజ్‌మెంట్ క్లిష్ట సమయంలో అత్యంత వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అక్షర్ పటేల్ స్థానంలో కర్ణాటక క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లను విజయవంతంగా నడిపించారు. ఐపీఎల్‌లో మొత్తం 66 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రాహుల్.. అందులో 32 విజయాలు, 31 ఓటములను ఖాతాలో వేసుకున్నాడు. ఆయనకున్న ఈ అనుభవం ఢిల్లీ జట్టును మళ్లీ విజయాల బాట పట్టిస్తుందని యాజమాన్యం బలంగా నమ్ముతోంది.

రిషభ్ పంత్ రీ-ఎంట్రీ? లక్నోతో భారీ ట్రేడింగ్!

ఈ వార్తతో పాటు మరో భారీ ట్విస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ సారథి, అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రిషభ్ పంత్‌ను ఎలాగైనా మళ్లీ జట్టులోకి తీసుకురావాలని ఢిల్లీ ఓనర్లు భావిస్తున్నారు. ఇందుకోసం లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే పంత్‌ను తిరిగి దక్కించుకోవడం కోసం ఢిల్లీ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు ట్రేడ్ (బదిలీ) చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్లలో కుల్దీప్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పాయింట్ల పట్టికలో ఆరో స్థానం.. మార్పు తప్పనిసరి!

గడిచిన సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఏమాత్రం కలిసిరాలేదు. ఆడిన మ్యాచ్‌లలో కేవలం కొన్నింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం, మైదానంలో కీలక నిర్ణయాలు ఫలించకపోవడంతో జట్టు భవిష్యత్తు కోసం ఈ పెను మార్పులు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలోనే రాహుల్ వంటి అనుభవజ్ఞుడి చేతిలో జట్టును పెడితే వచ్చే సీజన్లో తిరుగుండదని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఆర్సీబీ లాంటి జట్లు దూసుకుపోతున్న తరుణంలో, తమ జట్టును కూడా టైటిల్ రేసులో నిలబెట్టడమే లక్ష్యంగా ఢిల్లీ అడుగులు వేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us