AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

మన వంటింటిని ఔషధాల గని అని అంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి గురించి. సువాసన, ఘాటైన రుచి కోసం వంటకాల్లో ఉపయోగించే వెల్లుల్లిలో అద్భుతమైన వైద్య గుణాలు ఉన్నాయి. పూర్వకాలం నుండి దీనిని రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకటీ రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jul 31, 2026 | 12:43 PM

Share
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ మరియు ఇతర సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

1 / 5
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది: క్రమం తప్పకుండా పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా కాపాడటమే కాకుండా, అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండెపోటు వంటి ముప్పు తగ్గుతుంది.

2 / 5
జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు: ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, ఇది మెటబాలిజంను పెంచి, శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

3 / 5
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ: డయాబెటిస్ లేదా మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచేందుకు తోడ్పడుతుంది.

4 / 5
కాలేయ శుద్ధి: వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు కాలేయంలో పేరుకుపోయిన హానికర విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇది లివర్ పనితీరును మెరుగుపరచి, శరీరాన్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. పచ్చి వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కాబట్టి, నమిలి తినలేని వారు చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటితో మింగవచ్చు. లేదా కొద్దిగా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే, అల్సర్ లేదా తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు, గర్భవతులు నిపుణుల లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దీనిని నిత్య జీవితంలో భాగం చేసుకోవడం శ్రేయస్కరం.

5 / 5
Follow Us