Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాక్‌ టు ఆఫీస్‌.. ఆ ఉద్యోగులకు ‘బొద్దింక’ల స్వాగతం వీడియో

బ్యాక్‌ టు ఆఫీస్‌.. ఆ ఉద్యోగులకు ‘బొద్దింక’ల స్వాగతం వీడియో

Samatha J

|

Updated on: Mar 22, 2025 | 2:13 PM

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆఫీసు నుంచే ఫుల్‌ టైం పని చేయాలంటూ ఫెడరల్‌ ఉద్యోగులకు ఆదేశాలిచ్చారు. దీంతో తమ కార్యాలయాలకు చేరుకున్న ఉద్యోగులకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆఫీసులో ఎక్కడికక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయని, కొంతమంది డెస్క్‌ లేకుండానే పనిచేస్తున్నట్లు ‘నాసా’ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. వీటికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

కొవిడ్‌-19 కారణంగా అనేక మంది ఫెడరల్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో కొన్నేళ్లుగా ఇళ్లకే పరిమితమైన వీరు.. ఇటీవల ట్రంప్‌ యంత్రాంగం ఆదేశాల తర్వాత ఆఫీసు బాట పట్టారు. ఇందులో భాగంగా వాషింగ్టన్‌లో ఉన్న నాసా ప్రధాన కార్యాలయ ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైందట. ఆఫీసులో డెస్కులు లేకపోవడంతోపాటు ఎక్కడికక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయని వాపోయారు.గత నెల కార్యాలయానికి వచ్చినప్పుడు.. పూర్తిగా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని నాసా ఉద్యోగ సంఘం తెలిపింది. ఫ్లోర్‌ మీద బొద్దింకలు, కుళాయిల్లో పురుగులు కనిపించాయని తెలిపింది. కనీసం డెస్కులు, కంప్యూటర్లు లేకుంటే విధులు ఎలా నిర్వర్తిస్తారని మరో ఫెడరల్‌ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. మరికొన్ని కార్యాలయాల్లో ఇంటర్నెట్‌ కూడా అందుబాటులో లేదని, కొందరు నేలపైనే కూర్చుంటున్నారని, వ్యక్తిగత ఫోన్‌ డేటా సాయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు మరో సంఘం తెలిపింది. ఇలా ఒత్తిడికి గురిచేయడం ద్వారా ఉద్యోగం విడిచి వెళ్లేలా చేయడమే ప్రభుత్వంగా ఉద్దేశంగా కనిపిస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్‌ వీడియో

38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో

నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో

మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో