AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H1B వీసాలపై భారత ప్రభుత్వం జోక్యం

H1B వీసాలపై భారత ప్రభుత్వం జోక్యం

Phani CH
|

Updated on: Dec 29, 2025 | 1:36 PM

Share

డిసెంబర్ 15 H1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా వాయిదా వేసింది, సోషల్ మీడియా తనిఖీల కోసం మే నెలకు మార్చింది. భారత ప్రభుత్వం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై లాటరీ కాకుండా నైపుణ్యం, అధిక వేతనం ఉన్నవారికే ప్రాధాన్యత. ఫీజు భారీగా పెరిగి రూ.89 లక్షలకు చేరింది. ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

డిసెంబర్‌ 15కి షెడ్యూల్ చేసిన భారతీయుల హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా క్యాన్సిల్‌ చేసింది. పెద్దసంఖ్యలో భారతీయ దరఖాస్తులుదారులు అసౌకర్యానికి గురవుతున్నారనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ అమెరికాకు తెలియచేసింది. ప్రస్తుతం ఈ అంశంపై భారత్, అమెరికా విదేశాంగ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయి. వేలాది మంది భారతీయ అప్లికంట్స్‌కు డిసెంబరు 15 నుంచి నిర్వహించాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ మే నెలకు వాయిదా వేసింది.వారి సోషల్ మీడియా పోస్టులను చెక్‌ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు ఆఖరి వారంలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన చాలా మంది భారతీయులకు అమెరికా ఇమిగ్రేషన్ నుంచి షాకింగ్ ఈ మెయిల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూ తేదీని వచ్చే సంవత్సరం మే కు మార్చామని మెయిల్‌లో ఉంది. భారతీయుల అసౌకర్యాన్ని తగ్గించే దిశగా అమెరికాతో మా సంప్రదింపులు కొనసాగిస్తున్నాం అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గతంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో నుంచి కొందరిని ర్యాండమ్‌ లాటరీ పద్ధతిలో హెచ్1బీ వీసాలకు ఎంపిక చేసారు. ఇకపై ఈ విధానం ఉండదు. ఎందుకంటే అత్యంత నిపుణులు, అధిక సాలరీలు ఉన్న వారికే హెచ్1బీ వీసాల జారీలో అమెరికా ప్రాధాన్యత ఇవ్వనుంది. దీనిపై డిసెంబరు 23న అమెరికా హోంల్యాండ్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికన్ ఉద్యోగులు, నిపుణుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి 27 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని తెలిపింది. 2025 సంవత్సరం సెప్టెంబరు 21 తర్వాత హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసే వారంతా 89 లక్షల రూపాయలను ఫీజుగా చెల్లించాలి. ఈ వీసా కాల పరిమితి మూడేళ్ల నుంచి ఆరేళ్ల పాటు ఉంటుంది. ఇంతకుముందు హెచ్1బీ వీసా ఫీజు రూ.1.79 లక్షల నుంచి రూ.4.49 లక్షల దాకా మాత్రమే ఉండేది. అయితే ట్రంప్ సర్కారు వీసా ఫీజును రూ.89 లక్షలకు పెంచింది. ఈ ఆర్థిక భారం ప్రధానంగా అమెరికా కంపెనీలపైనే పడనుంది. ప్రస్తుతం ఏటా దాదాపు 85 వేల హెచ్1బీ వీసాలను అమెరికా మంజూరు చేస్తోంది. భారీగా పెరిగిన వీసా ఫీజు, మారిన ప్రాతిపదికల ప్రకారం 2026 సంవత్సరం నుంచి అమెరికా ఎన్ని హెచ్1బీ వీసాలను జారీ చేస్తుందో వేచిచూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్‌