నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని నానుడి. నిజంగానే మొక్కలు, చెట్లు పరిసరాలకు అందాన్న సానుకూలతను తెస్తాయి. పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. చాలామంది ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచుకుంటారు. అవి ఇంటికి అందంతోపాటు.. ఆహ్లాదకర వాతావరణాన్ని పెంచుతాయి. చాలామంది మొక్కలను ఇంటి లోపల, వెలుపల కూడా మొక్కలను పెంచుతారు. అయితే ఈ మొక్కలను పెంచుకునే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయంటున్నారు కొందరు. ఈ మొక్కలకు మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుందని, అందుకే ఏ చెట్టు ఎక్కడ నాటాలి? ఏ మొక్క ఏ ఫలితాన్నిస్తుంది? తెలుసుకొని తదనుగుణంగా మొక్కలు నాటుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
అలా చేయడం వల్ల జీవితం సంతోషంగా, సంపన్నంగా సాగుతుందంటున్నారు.నిమ్మపండ్లు ఆరోగ్యానికి మంచిదని చాలామంది తమ ఇంటి ఆవరణలో నిమ్మచెట్లు పెంచుకుంటారు. అయితే ఇది ముళ్లమొక్క కనుక దీన్ని నాటే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే నిమ్మమొక్క చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. నిమ్మలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. దీని ఆకులు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ నిమ్మ మొక్క చెడు దృష్టి నుండి ఇంటిని రక్షిస్తుందని నమ్ముతారు. నిమ్మకాయలు చెడుదృష్టిని, ప్రతికూల శక్తిని తగ్గిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. అందుకే వాహనాలకు, ఇంటి గుమ్మాలకు ముందు భాగంలో నిమ్మకాలు కడతారు. అలాగే శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ఇంటి ఆవరణలో నిమ్మచెట్టు నాటితే శనిగ్రహ ప్రతికూల ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఏదైనా గ్రహ దోషాలతో బాధపడేవారు నిమ్మచెట్టును నాటి, ప్రతిరోజూ నీళ్లు పోయడం వల్ల ఈ గ్రహదోషాలనుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తారు. ఇంట్లో సరైన దిశలో నిమ్మకాయ మొక్కను నాటితే.. అది ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే ఈ నిమ్మ మొక్కను ఎట్టి పరిస్థితుల్లోకూ ఇంటికి తూర్పు దిశలో నాటకూడదని చెబుతారు. నిమ్మ మొక్కను ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో నాటవచ్చట. ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున నిమ్మ చెట్టును నాటడం శుభప్రదంగా చెబుతారు.