Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ Vs బైడెన్‌.. అసలు ఏమిటీ ఆటో పెన్‌ వీడియో

ట్రంప్‌ Vs బైడెన్‌.. అసలు ఏమిటీ ఆటో పెన్‌ వీడియో

Samatha J

|

Updated on: Mar 23, 2025 | 1:10 PM

అమెరికాలో కొత్త, పాత అధ్యక్షుల మధ్య ప్రత్యక్ష యుద్ధం షురువైంది. గతంలో బైడెన్‌ పాలక కార్యవర్గం మంజూరుచేసిన క్షమాభిక్షలు చెల్లవంటూ ట్రంప్‌ ప్రకటించడం కలకలం రేపుతోంది. నాడు ఇచ్చిన క్షమాభిక్షలన్నిటిపై ఆటోపెన్‌తో సంతకం చేయడం, వాటి గురించి అసలు బైడెన్‌కు ఏమీ తెలియవన్నది ట్రంప్‌ వాదన. బైడెన్‌ నిద్ర మత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలామందికి క్షమాభిక్షలు ప్రసాదించారని..అవి చెల్లవని తేల్చిచెప్పారు. అయితే ఆటోపెన్‌ వివాదం తెరపైకి రావడంతో అసలు ఏమిటీ ఆటోపెన్‌..? అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

 ఆటోపెన్‌ అనేది వ్యవహారికంలో వచ్చిన పేరు. డూప్లికేట్‌ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే యంత్రం అన్నమాట. ఇవి ప్రజాజీవితంలో ఉండే కీలక వ్యక్తులు, సెలబ్రిటీలు వాణిజ్య అవసరాల కోసం భారీ సంఖ్యలో ఆటోగ్రాఫ్‌లు చేయడానికి వాడుతుంటారు. ఒక ప్రింటర్‌ సైజులో ఆర్టిఫిషియల్‌ హస్తంతో ఇది ఉంటుంది. ఇది ఒక సాధారణ పెన్ను లేదా పెన్సిల్‌ను పట్టుకోగలదు. దీనిలో ప్రోగ్రామ్‌ చేసిన సంతకం పేపర్‌పై రాస్తుంది. సాధారణంగా వీటిని యూనివర్శిటీలు, గవర్నమెంట్‌ ఏజెన్సీలు, ఇతర సంస్థల్లో దాదాపు 60 ఏళ్ల నుంచి వాడుతున్నట్లు ది ఆటోపెన్‌ కంపెనీ పేర్కొంది. 19వ శతాబ్ధం మొదట్లో ఓ ప్రత్యేకమైన పాలిగ్రాఫ్‌ యంత్రం వాడేవారు. దీంతో రెండు పెన్నులను వాడుతూ రాయడానికి వీలుండేది. 1803లో దీనిపై పేటెంట్‌ లభించింది. అప్పట్లో థామస్‌ జెఫర్సన్‌ ఆయన పదవీకాలం అనంతరం కూడా దీనిని వినియోగించారు. 2005లో అమెరికాలోని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌లోని ది ఆఫీస్‌ ఆఫ్‌ లీగల్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల ప్రకారం ఆటోపెన్‌ వాడటం చట్టబద్ధమే. గతంలో కూడా చాలామంది అధ్యక్షులు ఆటో పెన్‌ వినియోగించారు. వీరిలో బరాక్‌ ఒబామా ది పేట్రియాట్‌ యాక్ట్‌కు సంబంధించి తీసుకొన్న నిర్ణయంపై ఆటోపెన్‌ వాడి సంతకం చేయడం నాడు వివాదాస్పదంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో

తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

ఈ కోతికి ఫోన్‌ కనిపిస్తే చాలు.. వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో