Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాచుపాము కరిచినా...10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

Samatha J

|

Updated on: Mar 22, 2025 | 1:11 PM

ఓ వైపు జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ ఎగ్జామ్.. మరోవైపు ప్రాణాలనే కబళించే తాచుపాము కాటు. అయినా ప్రాణాలను రిస్కులో పెట్టి మరీ ఆ విద్యార్థి పదవ తరగతి పరీక్ష రాశాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వై నిస్సి అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు సమీపించడంతో శనివారం సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉండగా.. పక్కనే ఉన్న ఓ రాయిపై వేలు పెట్టడంతో తాచుపాము కాటేసింది.

 దీంతో ఉపాధ్యాయులు ఆ బాలుడిని హుటాహుటిన అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది.అయితే సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవడంతో ఉదయం ఆసుపత్రి నుంచి నేరుగా లక్ష్మీ నరసాపురంలోని ఎపరీక్షా కేంద్రానికి ఎగ్జామ్ రాశాడు. అనంతరం మళ్లీ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. సాధారణంగా పాములు.. పొలాలు, అడవులు, ఏజెన్సీ ప్రాంతాల్లో… నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. ఐతే అడవులు క్రమంగా తగ్గిపోవడం వల్ల పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనికి తోడు పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో అవి బయట తిరుగుతున్నాయి. అందునా ఇప్పుడు వేసవి సమీపించడంతో.. వేడి తాపానికి నీటి కోసం అవి జనాలు ఉండే ప్రాంతాలకు వస్తూ ఉంటాయి. పాముల బెడద తగ్గాలంటే అడవులను విచ్చలవిడిగా నరకడాన్ని ఆపేయాలి. నీటి కాలుష్యాన్ని తగ్గించాలి. పాము కరచినపుడు నాటు వైద్యం, మంత్రవైద్యం కాకుండా తప్పనిసరిగా ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్‌ వీడియో

38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో

నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో

మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో