22 March 2025
కోపం వస్తే తెలుగులోనే బూతులు తిడతాను.. హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ముంబై బ్యూటీ.. కానీ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. కోపం వస్తే తెలుగులోనే బూతులు తిడతానంటూ అసలు విషయం చెప్పేసింది.
పదిహేనేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఆమె మరెవరో కాదు. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఓదెల 2 చిత్రంలో నటిస్తుంది. 2021లో వచ్చిన ఓదెల మూవీకి సీక్వెల్ ఇది.
హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఏప్రిల్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తనను ఎక్కువగా తెలుగమ్మాయే అనుకుంటారని.. తాను కూడా అలాగే ఫీలవుతానని తెలిపింది. తెలుగులోనే మాట్లాడతానని చెప్పుకొచ్చింది.
కోపం వస్తే తెలుగులోనే బూతులు తిడతానని చెప్పుకొచ్చింది. ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మానేసిందని సమాచారం.
ఈ సినిమాలో తమన్నా అఘోరా పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్