AP News: ఆలయాల ఎదురుగా కుక్కల కళేబరాలు.. అసలు స్టోరీ వింటే కళ్లు తేలేస్తారు..
మూడు రోజుల కిందట ఆలయాలు ఎదురుగా ఉన్న వీధి కుక్కలు వరుసగా చనిపోయాయి. వాటి కళేబరాలు అక్కడ దర్శనమిచ్చాయ్. అసలేం జరిగిందో..? ఏంటో.? తెలియదు.. ఈలోగా అనూహ్యం సంఘటన ఎదురైంది. అసలేం జరిగిందంటే.. ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలోని దేవాలయాల్లో వరుసగా దొంగతనాలు జరిగాయి. స్థానిక గంగానమ్మ గుడి, వీరమ్మ గుడిలో దొంగతనాలు జరగ్గా.. రామాలయంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు దుండగులు. గంగానమ్మ అమ్మవారి బంగారు సూత్రాలు అపహరించారు. అలాగే వీరమ్మ ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి స్కెచ్ వేశారు దుండగులు. ఈ దొంగతనాలతో.. మరో సంచలన విషయం బయటపడింది. దేవాలయాల వద్ద ఉంటున్న వీధి కుక్కలను మూడు రోజుల క్రితమే మందు పెట్టి చంపినట్టు గుర్తించారు. దీంతో గ్రామస్తులలో తీవ్ర భయాందోళన నెలకొంది.
వైరల్ వీడియోలు
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

