AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak : ఇదెక్కడి అరాచకం రా మామ..! లాలా సాంగ్‌కు థియేటర్‌లో తమన్ మాస్ డ్యాన్స్..

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌, రానా నటించిన ‘భీమ్లానాయక్‌’ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌ సొంతం చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే

Bheemla Nayak : ఇదెక్కడి అరాచకం రా మామ..! లాలా సాంగ్‌కు థియేటర్‌లో తమన్ మాస్ డ్యాన్స్..
Thaman
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2022 | 5:27 PM

Share

Bheemla Nayak : పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌, రానా నటించిన ‘భీమ్లానాయక్‌’ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌ సొంతం చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. థియేట‌ర్ల వ‌ద్ద ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో మ‌రింత ఖుషీ అవుతున్నారు. డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, బాణాసంచా మోతతో థియేట‌ర్ల వ‌ద్ద‌ హోరెత్తిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం తమన్ సూపర్ మ్యూజిక్ అందించారు. భీమ్లానాయక్ పాటలకు థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ డ్యాన్స్ లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ ఫ్యాన్స్‌లో ఒకరిగా మారిపోయారు ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్, డ్రమ్స్‌ స్పెషలిస్ట్ శివమణి.

ఈ మ్యూజిక్ స్టార్లిద్దరూ.. పవన్‌ ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లో రచ్చ రచ్చ చేశారు. అవును! ఓ థియేట‌ర్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన త‌మ‌న్, శివమణి. లాల్ లాల్ భీమ్లా పాట రాగానే.. తెర ముందుకు వెళ్లి.. అభిమానుల‌తో క‌లిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో థియేటర్ మొత్తం పవన్‌ ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. వీరికి తోడుగా అభిమానులు కూడా స్క్రీన్ ముందు డ్యాన్స్‌ చేయడంతో.. హాల్ మాస్‌ జాతర అడ్డాగా మారిపోయింది. అయితే ఈ వీడియోను తమన్ స్వయంగా తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో బాలయ్య నటించిన అఖండ సినిమాలోని జై బాలయ్య పాటకు కూడా తమన్ ఇలానే తేరా ముందు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Meenakshi Chaudhary: అందాలు ఆరబోస్తున్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ.

Shilpa Shetty: వయసు తో పాటు పెరుగుతున్న అందం.. శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?