Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఆనపకాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి.

Viral Photo: అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?
Heroine Viral Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 26, 2022 | 11:01 AM

Tollywood: ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఆనపకాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. హీరోయిన్స్‌కి స్పాన్ ఇంకా తక్కువగా ఉంటుంది. గతంలోలా దశాబ్ధాలపాటు రాణించడం కష్టతరమైన పని. కానీ ఈ ఫోటోలోని నటి మాత్రం 12 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు(Telugu), తమిళ(Tamil), మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియా(Social Media)ను షేక్ చేయడంలోనూ ఈ హీరోయిన్‌ను మించినవారు లేరని చెప్పుకోవాలి. హీరోయిన్ల పెళ్ళికి, కెరీర్‌కి ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తూ ప్రేక్షాధారణ పొందుతూ ముందుకు సాగింది. విడాకుల అనంతరం కూడా సినిమాల విషయంలో అదే స్పీడుతో వెళ్తుంది. యస్… మీ గెస్ కరెక్టే. ఆ ఫోటో ఉంది సమంత. ఏప్రిల్ 28వ తేదీ 1987 సంవత్సరం జన్మించిన సమంత.. సౌత్ జనాలు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.  ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సొంతం చేసుకున్న ఆమె.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కుంది.  ఫస్ట్ మూవీ హీరో నాగచైతన్యతోనే ప్రేమలో పడ్డ ఆమె.. చాలా ఏళ్లు  ప్రేమాయణం కొనసాగించి చివరకు పెళ్లితో అక్కినేని వారింట అడుగుపెట్టింది. అయితే ఈ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. గత ఏడాది.. అక్టోబర్ 2న వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు.

గ్లామర్ హీరోయిన్ గానే కాదు సామాజిక కోణంలో ఆలోచిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది సామ్. ‘ప్రత్యూష సపోర్ట్’ అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించిన ఆమె.. పేద పిల్లలకు విద్య, వైద్యం అందిస్తుంది. కాగా నేటితో సమంత ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇన్ స్టా వేదికగా ఓ ప్రత్యేకమైన పోస్ట్ పెట్టింది సమంత. ‘ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే..నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న విషయాన్ని గ్రహించాను. లైట్లు, కెమెరా, యాక్షన్ అంటూ సాగిన ఈ 12 సంవత్సరాల జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు. ఇంత గొప్ప ప్రయాణంలో ప్రపంచంలోనే అత్యుత్తమ, అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమాతో నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదని.. ఇంతే బలంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను’ అని సామ్ రాసుకొచ్చింది.

Also Read: Bheemla Nayak Collections: అడవి బిడ్డ భీమ్లా బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు.. ఏంది సామి ఈ ఊచకోత

ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది.. ఈ మొక్క గుణాలు తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే