AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: విదేశాల్లోనూ దుమ్మురేపుతోన్న భీమ్లా నాయక్‌.. ప్రివ్యూ స్క్రీనింగ్స్‌తోనే ఎంత రాబట్టిందో తెలుసా?

Bheemla Nayak: విడుదలైన అన్ని చోట్ల మంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది భీమ్లా నాయక్‌ చిత్రం. పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan), రానా (Rana)లు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. పవన్‌ కళ్యాణ్‌, రానాల అద్భుత నటన..

Bheemla Nayak: విదేశాల్లోనూ దుమ్మురేపుతోన్న భీమ్లా నాయక్‌.. ప్రివ్యూ స్క్రీనింగ్స్‌తోనే ఎంత రాబట్టిందో తెలుసా?
Bheema Nayak
Narender Vaitla
|

Updated on: Feb 26, 2022 | 10:40 AM

Share

Bheemla Nayak: విడుదలైన అన్ని చోట్ల మంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది భీమ్లా నాయక్‌ చిత్రం. పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan), రానా (Rana)లు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. పవన్‌ కళ్యాణ్‌, రానాల అద్భుత నటన.. థమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ ఇలా సినిమాకు అన్ని ప్లస్‌ అవ్వడంతో భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌజ్‌ ఫుల్‌ షోస్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా, విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. ప్రివ్యూ స్క్రీనింగ్స్‌లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిందీ చిత్రం.

తాజాగా ఓవర్‌సీస్‌ బిజినెస్‌పై ప్రముఖ మూవీ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్‌ సినిమా అమెరికాలో కేవలం గురువారమే రూ. 6.53 కోట్లు రాబట్టింది. ఇక యూకేలో రూ. 87,81 లక్షలు, ఐర్లాండ్‌లో రూ. 6.44 లక్షలు సాధించడం విశేషం. ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా శుక్రవారం ఒక్కరోజే రూ. 83.22 లక్షలు వసూలు చేయడం విశేషం. వీకెండ్‌ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అంచనా వేస్తున్నారు. ఇలా భీమ్లా నాయక్‌ పవన్‌ కెరీర్‌లోనే ఓవర్‌సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవనుంది.

ఇదిలా ఉంటే భీమ్లా నాయక్‌ చిత్రాన్ని మలయాళంలో సూపర్‌ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. పేరుకు రీమేక్‌ చిత్రమే అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమాల్లో చాలా మార్పులు చేశారు మేకర్స్‌. ముఖ్యంగా త్రివిక్రమ్‌ డైలాగ్స్‌, పవన్‌ కళ్యాణ్‌ను ఎలివేట్‌ చేస్తూ దర్శకుడు సాగర్‌ తీసిన సన్నివేశాలను అభిమానులను ఫిదా చేస్తున్నాయి. భీమ్లా నాయక్‌కు పోటీగా ప్రస్తుతం థియేటర్లలో మరే సినిమా లేకపోవడం, వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో భీమ్లా నాయక్‌ కలెక్షన్లు భారీగా ఉండనున్నాయి.

Also Read: Viral Video: ఈ మొసలి మహాముదురు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

Viral Video: నేనాడితే లోకమే ఆడదా..! బెలూన్‌తో ఆటలాడిన పప్పీ.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు

LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులకు అలెర్ట్.. ఆ గడువు మరో రెండు రోజులే.. పూర్తి వివరాలు