Viral Video: ఈ మొసలి మహాముదురు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!
Crocodile Viral Video: ప్రమాదకర జంతువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే క్రమంంలో భారీ రక్షణ చర్యలు తీసుకుంటారు. అయితే.. అలాంటి రక్షణ వలయం దాటుకొని ఓ మొసలి..
Crocodile Viral Video: ప్రమాదకర జంతువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే క్రమంంలో భారీ రక్షణ చర్యలు తీసుకుంటారు. అయితే.. అలాంటి రక్షణ వలయం దాటుకొని ఓ మొసలి.. రోడ్డుపై వెళ్తున్న జనాన్ని భయపెట్టింది. తరలిస్తున్న వ్యాన్ కిటీకిని ధ్వసం చేసి తప్పించుకుంది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా (Florida) లో జరిగింది. జూలోని నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా.. వ్యాన్ నుంచి మొసలి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. సెయింట్ అగస్టిన్ ఎలిగేటర్ ఫార్మ్ జూలాజికల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ (Social Media) గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. కార్సిన్ మెక్‌క్రెడీ, జనరల్ ఆండర్సన్ అనే మహిళలు మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి మొసలిని తరలిస్తుండగా.. వ్యాన్ కిటికీ ధ్వంస చేసి తప్పించుకుంది. ఇది చూసి ఇద్దరు సిబ్బంది మొసలిని సకాలంలో పట్టుకుని మళ్లీ అక్కడినుంచి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను జెస్సికా స్టార్ రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శిక్షణ, అభ్యాసం అవసరం అంటూ పేర్కొన్నారు. అదృష్టం ఎంటంటే.. తరలిస్తున్న సమయంలో మొసలి నోటికి రక్షణ కవచం ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
వైరల్ వీడియో..
మొసలిని పట్టుకునేందుకు సిబ్బంది ఎలా కష్టపడుతున్నారో ఈ వీడియో చూడవచ్చు. మొసలిని పట్టుకున్న మహిళలను అధికారులు ప్రశంసించారు. వీడియో చూసిన తర్వాత చాలామంది పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తుంటే భయానకంగా ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం ముఖ్యమంటూ పేర్కొంటున్నారు.
Also Read: