Russia Ukraine War: అధికారం చేతుల్లోకి తీసుకోండి.. రష్యా ఆర్మీకి పుతిన్ కీలక సూచనలు..

అన్ని దారులు మూసుకుపోయి విలవిలలాడుతోంది ఉక్రెయిన్‌.. రష్యా వైమానికి దాడుల్లో విమానాశ్రయాలు, మిలటరీ స్థావరాలు ధ్వంసమైపోయాయి.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోకి ప్రవేశించాయి..

Russia Ukraine War: అధికారం చేతుల్లోకి తీసుకోండి.. రష్యా ఆర్మీకి పుతిన్ కీలక సూచనలు..
Putin
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 25, 2022 | 10:15 PM

అన్ని దారులు మూసుకుపోయి విలవిలలాడుతోంది ఉక్రెయిన్‌(Ukraine).. రష్యా(Russia) వైమానికి దాడుల్లో విమానాశ్రయాలు, మిలటరీ స్థావరాలు ధ్వంసమైపోయాయి.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోకి(Kyiv) ప్రవేశించాయి రష్యన్‌ బలగాలు. దేశాన్ని రక్షించుకోడానికి ఆయుధాలు చేత పట్టారు ఉక్రెయిన్‌ పౌరులు.. ఈ దశలో అనూహ్యంగా ఇరువైపులా చర్చల ప్రస్థావన తెర మీదకు వచ్చింది.. ఆయుధాలు వీడితే చర్చలకు సిద్దమనంటూ రష్యా చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్పింది ఉక్రెయిన్‌. ఉక్రెయిన్‌పై అన్ని వైపులా దాడులు చేస్తోంది రష్యా సైన్యం. మిసైల్‌, వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌ మిలటరీ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా ఇలాంటి విధ్వంసక, భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. రష్యా బలగాలు- ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు దగ్గర్లోని ఖెర్సన్‌లోకి ప్రవేశించాయి. ఆ ప్రాంతంపై పట్టు బిగించాయి. ఉక్రెయిన్‌లోని మిలటరీ స్థావరాలను ఉక్కిరబిక్కిరి చేసి, పూర్తిగా పట్టుబిగిస్తున్నాయి రష్యా బలగాలు. అయితే తాము వెయ్యి మంది రష్యన్‌ సైనికులను చంపేసినట్లు ఉక్రెయిన్‌ చెబుతోంది.

రష్యన్‌ సైన్యం క్రమంగా ముందుకు వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది ఉక్రెయిన్‌.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ బంకర్‌లోకి వెళ్లిపోయారు. నమ్ముకున్న దేశాలు ఆదుకునేందకు ముందుకు రావడంతో.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దమన్నారు జెలెన్‌స్కీ.. రష్యా తనను ప్రధాన శత్రువుగా, చూస్తోందని.. తన కుటుంబాన్ని టార్గెట్‌ చేసిందని ఆరోపించారు.

తమ దేశాన్ని శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు సిద్దమయ్యారు ఉక్రెయిన్‌ పౌరులు.. సైన్యంతో పాటుగా సాధారణ పౌరులు కూడా ఆయుధాలు పట్టారు.. వీరి కోసం18 వేల ఆయుధాలను ఇచ్చింది ప్రభుత్వం.. యువకులతో పాటుగా దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా రంగంలోకి దిగారు.. 16 నుంచి-60 ఏళ్ల వయసున్న పురుషులు దేశం వదిలి వెళ్లొద్దని కోరింది ఉక్రెయిన్‌ ప్రభుత్వం..

భీకర దాడులు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని తెలిపింది. యుద్ధాన్ని ఆపాలని.. చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటన తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు.

శాంతినెలకొల్పేందుకు రష్యా, ఉక్రెయిన్‌లతో చర్చిస్తామంటూ స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించినట్లు డ్రాగన్‌ దేశం వెల్లడించింది. చర్చలతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని జిన్‌పింగ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది..

అమెరికాతో పాటు యూరోప్‌ దేశాలు రష్యాపై తెచ్చిన వత్తిడి ఫలించినట్లే కనిపిస్తోంది.. ఉక్రెయిన్‌ మీద యుద్దానికి దిగిన రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ సహా పలు దేశాధినేతలు హెచ్చరించారు. మరోవైపు పుతిన్‌ సామాజ్రవాదంపై రష్యాలో కూడా నిరసన వ్యక్తం అవుతోంది. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా రష్యాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజధాని మాస్కోలో జనం రోడ్ల మీదకు వచ్చారు.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..

 Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?