Russia Ukraine Crisis: నేను కీవ్ లోనే ఉన్నాను.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు..
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దళాలు సైనిక దాడి ప్రారంభించడంతో ఆ దేశ రాజధాని కీవ్ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దళాలు సైనిక దాడి ప్రారంభించడంతో ఆ దేశ రాజధాని కీవ్ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుద్ధం మొదలైన రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్(Kyiv)పై బాంబుల వర్షం కురిపించాయి రష్యన్ సైనిక బలాలు. దీంతో కీవ్ పౌరులు తమ ప్రాణాలు నిలుపుకునేందుకు నగరాన్ని విడిచిపెడుతున్నారు. వెస్టర్న్ ఉక్రెయిన్ లాంటి సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా ఉక్రెయిన్ భద్రతా దళాలు ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీని బంకర్లలోకి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను జెలెనెస్కీ (Zelensky) ఖండించారు. తాను కీవ్‌లోనే ఉండి పోరాటం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
కీవ్‌ను కాపాడుకుంటాం..
‘నేను సెంట్రల్ కీవ్‌లోనే ఉన్నాను. మా ఆర్మీ అంతా కూడా ఇక్కడే ఉంది. దేశ పౌరులు కూడా ఇక్కడే ఉన్నారు. మా దేశాన్ని, స్వాతంత్ర్యాన్ని కాపాడుకునేందుకు ఇక్కడే ఉంటాం. ప్రత్యర్థి బలగాల నుంచి కీవ్‌ను కాపాడుకుంటాం’ అని కీవ్ లోని అధ్యక్ష భవనం ఎదురుగా నిల్చొని మాట్లాడారు జెలెన్ స్కీ. కాగా ఈ వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాక తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. ఈ వీడియోలో జెలెన్‌స్కీతో పాటు ఉక్రెయిన్ ప్రధాని, భద్రతా బలగాల ఛీప్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. వీడియోలో వీరంతా మిలిటరీ తరహా ఆలివ్ గ్రీన్ దుస్తు్లో కనిపించారు.
?Президент України Володимир Зеленський: “Всі ми тут – захищаємо нашу Незалежність, нашу державу! Так буде й надалі. Слава нашим захисникам і захисницям! Слава Україні!??” pic.twitter.com/hojX94ONDI
— Defence of Ukraine (@DefenceU) February 25, 2022
Also Read:Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
Russia Ukraine War: అధికారం చేతుల్లోకి తీసుకోండి.. రష్యా ఆర్మీకి పుతిన్ కీలక సూచనలు..
UP Assembly Election 2022: యూపీ ఎన్నికలు.. ఓటర్లకు అఖిలేష్ ఇచ్చిన ఆ హామీ గేమ్ ఛేంజర్ కానుందా?