Russian weapons: కదనరంగంలో రంకెలేస్తున్న రష్యా.. ఆ దేశ అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలెన్ని?

ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలెట్టిన రష్యా.. రోజురోజుకూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నారు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌.

Russian weapons: కదనరంగంలో రంకెలేస్తున్న రష్యా.. ఆ దేశ అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలెన్ని?
Vladimir Putin
Follow us
Balaraju Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 26, 2022 | 2:48 PM

Russia Ukraine conflicts: ఉక్రెయిన్‌(Ukraine)పై దండయాత్ర మొదలెట్టిన రష్యా(Russia).. రోజురోజుకూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నారు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin). అప్‌డేటెడ్‌ మిస్సైల్స్‌, ఫైర్‌ జెట్స్‌, అత్యాధునిక యుద్ధ ట్యాంకర్లు… ఇలా ఒకటేమిటి.. తన దగ్గర అన్ని వెపన్స్‌నీ… బయటకు తీస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రష్యా ఉపయోగిస్తున్న కీలక వెపన్స్‌, వార్‌ వెహికిల్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల్లో క్షిపణులు, శతఘ్నులు, విమానాలు.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 25న ఒక్కరోజే.. ఉక్రెయిన్‌కు చెందిన 80 సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది రష్యా. ఇందుకోసం 160కిపైగా క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు యుద్ధ ట్యాంకులతో విరుచుకుపడుతోంది. ప్రధానంగా కల్బీర్ క్రూయిజ్ మిస్సైళ్లు, సికిందర్ వ్యూహాత్మక బాలిస్టిక్ మిస్సైళ్లు, ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లు, స్మెర్చ్ రాకెట్లతో ఉక్రెయిన్‌ సైన్యానికి ఊపిరాడకుండా చేస్తోంది. పదాతి దళాలకు వెన్నుదన్నుగా నిలిచే 75 ఫైటర్ జెట్లు, బాంబర్లను రంగంలోకి దించింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఆక్రమణ కోసం ఏకంగా రెండు డజన్ల ఎంఐ-8 హెలికాప్టర్ల ద్వారా దాడులు చేసింది రష్యా సైన్యం.

ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన యుద్ధంలో… టీ-90 ట్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డాగెస్థాన్, సిరియా, ఉక్రెయిన్ ఘర్షణల్లో సత్తా చాటాయి ఈ టీ90 ట్యాంకులు. కొంటాక్ట్-5 ఎక్స్ ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ కవచం… రాకెట్ దాడులనుంచి వీటిని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు, మిసైల్స్ ను తప్పుదోవపట్టించే ష్టోరా-1 వ్యవస్థ టీ 90 ట్యాంకుల్లో ఉంటుంది. తనపై జరిగే దాడిని ముందుగా గుర్తించే ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ వ్యవస్థ ఈ అధునాతన యుద్ధ ట్యాంకుల్లో అమరి ఉంటుంది. ప్రత్యర్థులకు తాను కనిపించకుండా ఉండేందుకు స్మోక్ గ్రనేడ్ వ్యవస్థ సైతం అమరి ఉంటుంది. టీ-90 ట్యాంకులతో పాటు ఈ సిరీస్ లోని టీ72బీ3 ట్యాంకులను కూడా యుద్ధంలో వినియోగిస్తోంది రష్యా.

ఈ యుద్ధంలో మరో యుద్ధట్యాంక్‌… కొలిట్‌సియా ఎస్‌వీ.. దుమ్మురేపుతోంది. ఇది సెల్ఫ్ గైడెడ్ 155ఎంఎం శతఘ్ని. ఇందులో ఆటో లోడింగ్ వ్యవస్థ ఉంటుంది. నిమిషానికి 16 రౌండ్లను పేల్చగలిగే సామర్థ్యం దీని సొంతం. లక్ష్యాన్ని కచ్చితంగా గురిచూసి ఛేదించే సామర్థ్యం కలిగివున్న కోలిట్ సియా శతఘ్ని… ఉక్రెయిన్‌ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ యుద్ధంలో రష్యా వాడుతున్న రకుస్కా సైనిక శకటం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇది సైనిక వాహనంగానేకాక.. గ్రెనేడ్ లాంచర్ గా, దీని నుంచి క్షిపణిలను ప్రయోగించే వీలుంటుంది. రిమోట్ కంట్రోల్ తో పనిచేసే 7.62 ఎంఎం గన్, 30ఎంఎం గ్రెనేట్ లాంచర్ అమర్చి ఉంటుంది. దీని ద్వారా, కోర్నెట్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించే వీలు ఉంటుంది.

ఉపరితలం నుంచి.. గగనతల లక్ష్యాల్ని అలవోకగా ఛేదించే సామర్థ్యంగల ఇస్కాండర్-ఎం మీడియం రేంజీ మిసైల్.. రష్యా ఆర్మీకి మరింత బలంగా మార్చిందని చెప్పాలి. దీని టార్గెట్‌ పరిధి 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ప్రయోగించేందుకు కూడా పెద్ద సమయం పట్టదు. 16 నిమిషాల్లోనే దీన్ని ప్రయోగించే వీలుంటుంది. ఇది, సూపర్ సోనిక్ వేగంతో దూసుకుపోయే క్షిపణి కావడం విశేషం. ప్రత్యర్థుల రాడార్లను తప్పదోవపట్టించేలా డికాయ్‌లను ఇది ప్రయోగిస్తుంది. అలాగే, ఉరగాన్-ఎం రాకెట్ సిస్టమ్ లాంటి మల్టీ రాకెట్ సిస్టమ్ రష్యా ఆర్మీకి అదనపు బలం. దీంట్లో రెండు ప్యాడ్‌లు ఉండగా ఒక్కో దానిలో 12 ఫైరింగ్ బ్యారెల్స్ ఉంటాయి. 300ఎంఎం రాకెట్లను ప్రయోగించే వీలుంటుంది. దీని ఎఫెక్టివ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ 35 కిలోమీటర్లు కాగా.. టోటల్‌గా ఫైరింగ్‌ రేంజ్‌ 90 కిలోమీటర్లు. ఆపరేషనల్‌ రేంజ్‌ 500 కిలోమీటర్ల వరకు ఉండటం విశేషం.

స్మెర్చ్ రాకెట్ సిస్టమ్ కూడా రష్మన్‌ ఆర్మీకి దగ్గరున్న మరో మల్టీ రాకెట్ సిస్టమ్. కేవలం 38 సెకన్లలలో 12 రాకెట్లను ప్రయోగించే సత్తా దీని సొంతం. 90కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను కూడా ఈజీగా ఛేదించే సామర్థ్యం దీని సొంతం. డీ12ఏ-525ఏ వీ12 డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ రాకెట్‌ సిస్టం ఆపరేషనల్‌ రేంజ్‌ 850 కిలోమీటర్లు. గంటకు 60 కిలోమీటర్లు వేగంతో కదిలే స్మెర్చ్‌.. ఉక్రెయిన్‌ సైన్యాన్ని స్మాష్ చేస్తోంది. రష్యా ఆర్మీలో మరో బలమైన క్షిపణి కల్బీర్ క్రూయిజ్ . 2500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే పవర్‌ క్రూయిజ్‌కు ఉంది. ఒకేసారి వందల టార్గెట్లను ఛేదించగలదు. గతంలో సిరియాపై రష్యా దాడిలో ఇవి సత్తా చాటాయి. ఇప్పుడు మరోసారి తమ పవర్‌ చూపిస్తున్నాయి.

ఇవే కాదు.. మిగం-29, సుఖోయ్ 35, సుఖోయ్ 25 యుద్ధ విమానాల ద్వారా దాడులు చేస్తోంది రష్యా. కమావ్ 52 అలిగేటర్ హెలీకాప్టర్లు, ఎంఐ-8 హెలీకాప్టర్లు సైతం బరిలో ఉన్నాయి.

Read Also….  UP Elections: పూర్వాంచల్‌లో బీజేపీ పట్టు నిలుస్తుందా? ఎస్పీ గెలుపు ఆశలపై బీఎస్పీ నీళ్లు చల్లుతుందా?