AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ తో మూడో వేవ్ వస్తుందా? వస్తే ఎన్నిరోజులు ఉంటుంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

భారతదేశంలో రాబోయే రోజుల్లో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ మూడో వేవ్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండదని కూడా చెబుతుండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ తో మూడో వేవ్ వస్తుందా? వస్తే ఎన్నిరోజులు ఉంటుంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
KVD Varma
|

Updated on: Dec 29, 2021 | 8:04 AM

Share

Omicron Variant: భారతదేశంలో రాబోయే రోజుల్లో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ మూడో వేవ్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండదని కూడా చెబుతుండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఒమిక్రాన్(Omicron) వేరియంట్ ప్రభావం కూడా ఇక్కడ చూడవచ్చు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పాల్ కేటుమాన్ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన ఆధ్వర్యంలోని నిపుణుల బృందం కోవిడ్-19 ఇండియా ట్రాకర్‌ను సిద్ధం చేసింది. దాని ప్రకారం..

కొన్ని రోజుల్లో కేసులు పెరుగుతాయి..

బ్లూమ్‌బెర్గ్‌కు ప్రొఫెసర్ పాల్ కేటుమాన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. రాబోయే కొద్ది రోజుల్లో లేదా కొన్ని వారాల్లో, భారతదేశంలో ఒమిక్రాన్ సంక్రమణ పెరుగుతుంది. అయితే ఇన్ఫెక్షన్ రేటు ఎంత ఉంటుందో చెప్పలేమని చెప్పారు. కోవిడ్-19 ఇండియా ట్రాకర్‌లో భారతదేశంలోని 6 రాష్ట్రాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యయనంలో రోజులు.. వారాల ఆధారంగా అంచనాలు రూపొందించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందినా.. ఎక్కువరోజులు మూడో వేవ్ ఉండకపోవచ్చని అధ్యయనం చెప్పింది. ఒమిక్రాన్ తో మరణాల రేటు డెల్టా అంత ఎక్కువ ఉండే అవకాశం లేదని కూడా అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే, ఒమిక్రాన్ సోకిన వారికి వచ్చే ఇతర ఇబ్బందులు.. కోలుకున్న తరువాత దాని ప్రభావం విషయంలో ఇంకా అంచానాలు వేయలేదని నిపుణులు చెబుతున్నారు. ఎదిఏమైనా భారత్ లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడో వేవ్ వచ్చె అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒమిక్రాన్

దేశంలో ఇప్పటివరకు 3.48 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 80 వేల మందికి పైగా మరణించారు. ఇక్కడ 653 మందికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. ఒమిక్రాన్ నుంచి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఎందుకంటే, ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. గత వారం బూస్టర్ డోస్ ఆమోదంతో పాటు 15 నుంచి 18 ఏళ్లలోపు యువతకు టీకాలు వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యాంటీవైరల్ పిల్ కూడా..

ఇటీవల మరో రెండు వ్యాక్సిన్‌లు ఆమోదించారు. దీనితో పాటు, జర్మన్ కంపెనీ మెర్క్ యాంటీ-వైరల్ పిల్ అంటే టాబ్లెట్ కూడా అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, గత ఏప్రిల్ .. మేలో కోవిడ్ కారణంగా దేశంలో పరిస్థితి మరింత దిగజారడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయాలను వేగంగా తీసుకుంది. ఆ సమయంలో రోజుకు దాదాపు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కుప్పకూలాయి. దాదాపు ప్రతిచోటా ఆక్సిజన్ కొరత కనిపించింది. కేంబ్రిడ్జ్ కోవిడ్-19 ఇండియా ట్రాకర్ ఏప్రిల్-మేలో కరోనా వేవ్ గురించి సమాచారాన్ని అందించింది. ఆగస్టు నాటికి కేసులు గణనీయంగా తగ్గుతాయని కూడా చెప్పారు. భారతదేశంలో ఇప్పటివరకు 141 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు.

ఇవి కూడా చదవండి: Multibagger stocks: రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూ.12 లక్షలు అయ్యాయి.. అదీ సంవత్సరంలోనే..

Sudan Gold Mine: కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు!

Alia bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీకి అరుదైన గౌరవం.. మూగజీవాలపై ప్రేమకు గుర్తుగా..