Sudan Gold Mine: కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు!

సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో మంగళవారం బంగారు గని కుప్పకూలడంతో కనీసం 38 మంది మరణించారు.

Sudan Gold Mine: కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు!
Sudan Gold Mine
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 29, 2021 | 7:40 AM

Sudan Gold Mine Accident: సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో మంగళవారం బంగారు గని కుప్పకూలడంతో కనీసం 38 మంది మరణించారు. రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసి ఉన్న గనిలో ప్రమాదం జరిగిందని సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలైనట్లు సమాచారం. మైనింగ్ కంపెనీ ఫేస్‌బుక్‌లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఘటనతో ఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వెలికి తీసేందుకు రెండు ప్రొక్లెయిన్ల ఉపయోగిస్తున్నారు.

రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసివేసిన గని కూలిపోయిందని దేశ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దిష్ట లెక్కలు చెప్పకుండా పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పేర్కొంది. దర్శయ గనిలో అనేక షాఫ్ట్‌లు కూలిపోయాయని, మృతులతో పాటు కనీసం ఎనిమిది మంది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని స్థానిక మీడియా వెల్లడించిందిజ

సుడాన్ దేశం అంతటా ఉన్న అనేక బంగారు గనులు ఉన్నాయి. 2020లో తూర్పు ఆఫ్రికా దేశం 36.6 టన్నులను ఉత్పత్తి చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఖండంలో రెండవది. అయితే, బంగారం స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో గత రెండేళ్లలో సుడాన్ ప్రభుత్వం బంగారం అక్రమ తవ్వాలను నియంత్రించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఫుజా గ్రామంలోని ఈ బంగారం గనిని మూసివేశారు. అయితే, స్థానికులు అక్రమంగా గనిలో తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. భద్రతా ప్రమాణాలు విస్తృతంగా అమలులో లేని కారణంగా సుడాన్ బంగారు గనులలో కూలిపోవడం సర్వసాధారణం.

Read Also… Shaakuntalam : న్యూ ఇయర్‌కు సమంత సర్‌ప్రైజ్ గిఫ్ట్..? గుణశేఖర్ శాకుంతలం సినిమా నుంచి..