Telangana Omicron cases: తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు.. పాజిటివిటీ రేటు తగ్గిందన్న మంత్రి హరీష్..
తెలంగాణలో ఇవాళ కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో, కొత్త వేరియంట్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 62కు చేరింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే ఈ కొత్త వేరియంట్..
Telangana Omicron cases: తెలంగాణలో ఇవాళ కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో, కొత్త వేరియంట్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 62కు చేరింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 62మందిలో.. 44 మంది వ్యాక్సిన్ వివిధ దేశాల నుంచి వచ్చినవారు కాగా… మిగితావారికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తోంది. తెలంగాణలో పాజిటివిటీ రేటు బాగా తగ్గిందన్నారు ఆరోగ్య మంత్రి హరీష్ రావు. దీనికి నిరంతరాయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడమే కారణమని భావిస్తున్నట్టు చెప్పారు. పాజిటివిటీ రేటు పదిశాతానికి మించినప్పుడే ఆంక్షలు విధించాలని కేంద్రం చెప్పినట్టు హరీష్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అది 0.6గానే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న హరీష్.. టెస్టులు, వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగంగా కొనసాగిస్తామన్నారు.
రాష్ట్రంలో వందశాతం మందికి ఫస్ట్ డోసు ఇచ్చామన్న హరీశ్.. త్వరలోనే 60 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇస్తామని చెప్పారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్ వేస్తామన్నారు. 2007కు ముందు పుట్టిన పిల్లలందరూ వ్యాక్సినేషన్‌కు అర్హులేనన్నారు.
మరోవైపు, ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ.. న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబర్ థర్టీ ఫస్ట్.. అర్ధరాత్రి ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్‌కు అనుమతించింది. జనాలెవ్వరూ గుమికూడవద్దని హెచ్చరించింది. కొవిడ్ నిబంధనలు తప్పినసరిగా పాటించాలని.. లేదంటే కఠినచర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..