AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

సినిమా టిక్కెట్ల వివాదంపై స్పందించిన హీరో సిద్ధార్థ్‌కు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని. చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్‌కు.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని ప్రశ్నించారు.

Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..
Ap Minister Perni Nani
Sanjay Kasula
|

Updated on: Dec 28, 2021 | 3:32 PM

Share

సినిమా టిక్కెట్ల వివాదంపై స్పందించిన హీరో సిద్ధార్థ్‌కు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని. చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్‌కు.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని ప్రశ్నించారు. సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటున్నారు.. ఆయన ఏది కొనుక్కున్న తమిళనాడు ప్రభుత్వానికే వెళుతుందన్నారు. రాజకీయ నాయకులు విలాసంగా బతుకుతున్నారని కామెంట్ చేయడం అది బహుశా స్టాలిన్‌ గురించి మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని. హీరో నాని చేసిన కిరాణా కొట్టు కామెంట్లకు కౌంటరిచ్చారు మంత్రి పేర్ని. ఆయన ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో తనకు తెలియదన్నారు. బాధ్యతతోనే మాట్లాడి ఉంటారని అనుకుంటున్నట్టు సెటైర్‌ వేశారు మంత్రి.

అయితే.. తెలంగాణ నుంచి ఏపీ వరకు రెండు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల వివాదం నానుతూనే ఉంది. ఎవరికి వారు మాటలు తూటాల్లో పేల్చుతున్నారు. ఏపీలో థియేటర్లలో తనిఖీలు, నిబంధనలు పాటించని వాటి సీజ్‌ కొనసాగుతోంది. కొన్ని థియేటర్ల యాజమానులు స్వచ్ఛందంగా తాళాలు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Congress Flag: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఎగరక ముందే కిందపడ్డ జెండా.. ఉలిక్కిపడ్డ సోనియా గాంధీ!

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..