Andhra Pradesh: కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రభుత్వ పథకాలు అందనీయడం లేదంటూ వ్యక్తి ఆత్మహత్య..
Andhra Pradesh: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నాడే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Andhra Pradesh: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నాడే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని తక్కెళ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని జాన్ అనే వ్యక్తి వార్డు వాలంటీర్ చిరంజీవిని వేడుకుంటూ వస్తున్నాడు. అయితే, చిరంజీవి అతని అభ్యర్థనలను పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి. ఆ ఘర్షణ కాస్తా పోలీసు కేసు వరకు వెళ్లింది. దీంతో జాన్ తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. సమీపంలోని తోటలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుకుంటున్న వార్డు వాలంటీర్ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..
Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. 36 వేల మందికి ఉద్యోగాలు