AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న దూసుకుపోతుంది.

Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..  బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2021 | 3:09 PM

Share

Pushpa: The Rise : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా పుష్ప ది రైజ్..భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప అన్ని ఏరియాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‏లో అదరగొట్టాడు బన్నీ. ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న మెప్పించింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజు రోజుకీ మరింత జోష్‏తో రికార్డ్స్ కలెక్షన్స్ కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

సుకుమార్ లేకుంటే నేను లేను.. సుకుమార్ పరిచయం కాకుంటే… అయనతో సినిమా చేయకుండా ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది అని అన్నారు అల్లు అర్జున్.  నా జీవితం ఇంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే అన్నారు బన్నీ. నా జీవితంలో చాలా తక్కువమందికి మాత్రమే రుణపడి ఉన్న అని పదం వాడుతా. నా తల్లిదండ్రులు.. మా తాతగారికి.. నాకు అండగా నిలిచినా చిరంజీవిగారికి ఆతర్వాత సుకుమార్ కు అని అన్నారు.. నువ్వు లేక పోతే నేను లేను.. ఆర్య లేదు.. మరేమీ లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బన్నీ.. అలాగే బన్నీ మాటలకు సుకుమార్ కూడా కంట తడి పెట్టుకున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోసిన రష్మి గౌతమ్… ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Bhanu Shree: బ్యూటిఫుల్ ఔట్ పిట్ పిచ్చెకిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ పిక్స్

Deepika Pilli:వంగ పండు దుస్తుల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న బ్యూటి ..