Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. 36 వేల మందికి ఉద్యోగాలు

Andhra Pradesh: ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సన్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. 36 వేల మందికి ఉద్యోగాలు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2021 | 2:57 PM

Andhra Pradesh: ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సన్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటుతో దాదాపు 36 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పరోక్షంగా  భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు పొందనున్నారు. సన్‌ఫార్మా ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. మంగళవారం రాష్ట్ర క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వి కంపెనీ ఏర్పాటు లాంఛనాలపై చర్చలు జరిపారు. అనంతరం ప్లాంట్‌ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఆయన ఆలోచనలు నన్ను ముగ్దుడ్నిచేశాయని దిలీప్‌ షాంఘ్వి అన్నారు.

కాగా, జనరిక్‌ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే హెల్త్‌కేర్‌ రంగంలో హైక్వాలిటీ మెడిసిన్‌ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ ఇది. 100కు పైగా దేశాల్లో సన్‌ఫార్మా మందులను వినియోగిస్తున్నారు.

Pharma

ఇవి కూడా చదవండి:

IT Returns: ఆర్థిక సంవత్సరానికి 4.51 కోట్లకు పైగా ఐటీ రిటర్నుల దాఖలు.. దరఖాస్తులకు సమయం దగ్గర పడుతోంది..!

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!