హిందూపురంలో హైటెన్షన్ .. బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తల ప్రయత్నం.. అడ్డుకున్న టీడీపీ నాయకులు..
అనంతపురం జిల్లా హిందూపురంలో టెన్షన్ వాతావరణం కనిపించింది. రాయలసీమ ప్రాంతంలో సినిమా సీన్‌ను తలపించే
అనంతపురం జిల్లా హిందూపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూపురంలో సినిమా సీన్‌ను తలపించే ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు టీడీపీ కేడర్.. మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి బయల్దేరిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఆరోపణలతో ఆ ప్రాంతం వేడెక్కింది. ఒకరిపై మరోకరు సవాళ్లు విసురుకున్నారు.
పట్టణంలో డంపింగ్ యార్ట్ మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్‌ను మార్చేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ కృషి చేశారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో హిందూపురానికి ఒరగబెట్టిందేమీ లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై చర్చకు కూడా సిద్ధమంటూ సవాల్ విసిరారు టీడీపీ నాయకులు. దీంతో టీడీపీ నాయకుల ఆరోపణలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్చకు సిద్ధమంటూ టీడీపీ కార్యకర్తలకు ప్రతి సవాల్ విసిరారు వైసీపీ నాయకులు. ఈ డైలాగ్‌లు ఇంతటితో ఆగలేదు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గరే చర్చిద్దాం అంటూ వైసీపీ కేడర్ బయల్దేరింది. బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించగా.. వారికి టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో.. హిందూపురంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు బాలకృష్ణ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
హిందూపురంలో డంపింగ్ యార్డు తరలింపు తప్ప మరే అభివృద్ధి చేయలేదని టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ చంద్రమౌళీ విమర్శించడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. బాలకృష్ణ ఇంటి వద్దే ఇరువర్గాల నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…