Payyavula Kesav: రాష్ట్రంలో ఆర్థిక అత్యాచారం జరుగుతోంది.. పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు!

అది ప్రజాగ్రహ సభ కాదు... జగన్‌ అనుగ్రహ దీక్ష అని ఆంధ్రప్రదేశ్ PAC చైర్మన్‌, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అత్యాచారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Payyavula Kesav: రాష్ట్రంలో ఆర్థిక అత్యాచారం జరుగుతోంది.. పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు!
Payyavula Kesav
Follow us

|

Updated on: Dec 28, 2021 | 12:48 PM

Payyavula Kesav Fire on BJP: అది ప్రజాగ్రహ సభ కాదు… జగన్‌ అనుగ్రహ దీక్ష అని ఆంధ్రప్రదేశ్ PAC చైర్మన్‌, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా నెట్‌వర్క్‌లో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మాత్రంలో జగన్‌ నెట్‌వర్క్‌లో పని చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అత్యాచారంపై విచారణ చేయించగలరా అని పయ్యావుల సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీ మౌనంగా ఉంటుందని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి జరిగినా పట్టించుకోలేదన్నారు. హిందుత్వ అంశాలపై కూడా బీజేపీ మౌనం వహిస్తోందని అన్నారు. కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నా బీజేపీ నేతలకు పట్టడంలేదని అన్నారు. బీజేపీ.. భారతీయ జగన్ పార్టీగా మారిందని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ జనాగ్రహ సభపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పయ్యావుల.. రాష్ట్రంలో భారతీయ జగన్ పార్టీ పాలన సాగుతోందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతినేత ఇంటిపై దాడులు జరుగుతాయి.. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. అదే పశ్చిమ బెంగాల్‌లో చీమ కుడితే కేంద్ర బృందాలు దిగుతాయి.. ఇన్నీ జరుగుతున్నా.. బీజేపీ అసలు మాట్లాడటంలేదు ఎందుకని పయ్యావుల ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఆధ్వర్యంలో బీజేపీ నడుస్తోందన్నారు. అమిత్ షా చెబితే తప్ప రాష్ట్ర బీజేపీకి తెలియదా.. బీజేపీ బ్రాండ్‌గా ఉన్న హిందూవులపై దాడి గురించి ఎందుకు మాట్లడరన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

Read Also… PM Modi Car: అప్‌గ్రేడ్ అయిన ప్రధాని మోడీ కారు.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!