AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ చెప్పి.. రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో మహేష్ బాబు తన భార్య పిల్లలతో గడపడానికి గడుపుతున్నాడు..

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..
Mahesh Babu Trivikram
Surya Kala
|

Updated on: Dec 27, 2021 | 9:34 PM

Share

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ చెప్పి.. రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో మహేష్ బాబు తన భార్య పిల్లలతో గడపడానికి గడుపుతున్నాడు. న్యూ ఇయర్ వేడుకలను కూడా దుబాయ్ లోనే తన ఫ్యామిలీతో కలిసి జరుపుకోనున్నాడు. అయితే అక్కడ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను కలిసినట్లు ఓ ఫోటోని మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మహేష్ బాబు తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు.. సెలవుపై దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు అక్కడ భీమ్లా నాయక్ చిత్ర టీమ్ ని కలిశాడు.  మహేష్ బాబు సర్కారి వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా గురించి చర్చించేందుకు మహేష్ బాబు కలిసి నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు తన ట్విట్టర్ లో త్రివిక్రమ్, థమన్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. . “వర్క్ అండ్ చిల్… టీమ్‌తో మధ్యాహ్నాం సంతోషంగా గడిచింది. అంటూ ఫోటో తోపాటు క్యాప్షన్ ఇచ్చాడు.

భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్,  నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సంగీత దర్శకుడు SS థమన్ లను ప్రిన్స్ మహేష్ బాబు కలిసిన ఫోటో అభిమానులను అలరిస్తోంది. అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌బాబు మూడోసారి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి  నటిస్తున్నాడు.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్, మహేష్‌ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనుంది.  త్వరలో పూజా’ కార్యక్రమం జారుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమ్ ప్రొడక్షన్, కాస్టింగ్ పని ప్రారంభించింది. ‘సర్కారు వారి పాట’ మూవీకి  ‘గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 2022లో విడుదల కానుంది. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

Also Read:  హిమపాతంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. స్వయంగా కారుని నెట్టుకుంటూ వెళ్లిన కిరణ్ రిజిజు

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..