AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Flag: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఎగరక ముందే కిందపడ్డ జెండా.. ఉలిక్కిపడ్డ సోనియా గాంధీ!

congress party Flag: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ వేడుకల్లో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పరిస్థితి ఎదురుకావడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Congress Flag: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఎగరక ముందే కిందపడ్డ జెండా.. ఉలిక్కిపడ్డ సోనియా గాంధీ!
Sonia
Balaraju Goud
|

Updated on: Dec 28, 2021 | 10:53 AM

Share

Congress party Flag: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ వేడుకల్లో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పరిస్థితి ఎదురుకావడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

137 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏటికి ఎదురీదుతోంది. రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో..కేంద్రంలో కూడా అదే పరిస్థితిలో ఉంది. నేతలు, కార్యకర్తల్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో పార్టీ ఉంది. జాతీయ స్థాయి పార్టీకు సరైన నాయకత్వమే లేకుండా పోయింది. పార్టీ సీనియర్ నేతలు పార్టీ పరిస్థితిపై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీలో సరైన క్రమశిక్షణ లోపించింది. ఇదే తరహాలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇదే పరిస్థితి పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవంలో కూడా కొట్టొచ్చినట్లు కనిపింది. ఘోరమైన చేదు అనుభవం తలెత్తింది. వాస్తవానికి పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించగా, ఇందులో కార్యకర్తలతో పాటు పలువురు కాంగ్రెస్ పెద్ద నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జెండాను ఎగురవేస్తుండగా.. కాంగ్రెస్ జెండానే ఊడిపోయి ఆమె చేతుల్లోనే పడిపోయింది. జెండా ఎగరకుండానే తలవంచేసింది. వెంటనే సరిచేసందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అలాగే కార్యక్రమాన్ని కానిచ్చేశారు పార్టీ కార్యకర్తలు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also…  Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!