AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. ఇటు దేశవ్యాప్తంగా చాపకింద నీరులా ఒమిక్రాన్ కేసులు పెరగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!
తూర్పు మద్య దేశాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య గతం వారంతో పోలిస్తే సమానంగా ఉంది. అటు ఆఫ్రికన్ ప్రాంతంలో మాత్రం మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏకంగా 72 శాతం మరణాలు సంభవించాయి. అటు దక్షిణ తూర్పు ఆసియాలో 9 శాతం మరణాలుంటే..అమెరికా ప్రాంతంలో 7 శాతం మరణాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల కోవిడ్ కేసులుంటే..5.4 మిలియన్ల మంది మరణించారు.
Balaraju Goud
|

Updated on: Dec 28, 2021 | 10:30 AM

Share

Central Health Department Meeting on Omicron: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. ఇటు దేశవ్యాప్తంగా చాపకింద నీరులా ఒమిక్రాన్ కేసులు పెరగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్ కట్టడికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. కాసేపట్లో.. అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం అవుతోంది.

కరోనా కట్టడి దిశగా.. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, వృద్ధులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అలాగే.. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి సైతం కొవిడ్ టీకాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన కూడా చేశారు, ఈ నేపథ్యంలో వివిధ ఆంశాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సమావేశమవుతున్నారు. ఈ ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్న సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నారు.

మరోవైపు.. 15 – 18 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం జనవరి 1 నుంచి కోవిన్ అప్లికేషన్ లో నమోదుకు అవకాశం ఇస్తున్నారు. జనవరి 3 నుంచి వీరికి కోవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది. తాజా సమావేశంలో ఈ విషయంపైనా తగిన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

మరోవైపు, దేశంలో కొత్త కరోనా సోకిన వారి సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. వరుసగా మూడవ రోజు, కొత్త కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుదల నమోదైంది. అయితే, ఓమిక్రాన్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పటివరకు, దేశంలో 653 మందిలో ఓమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 186 మంది ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మారారు.

Read Also… Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం