Corona Positive: తెలంగాణలో కరోనా కలకలం.. ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
Corona Positive: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, ఇతర చర్యల వల్ల ప్రస్తుతం తగ్గుముఖం..
Corona Positive: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, ఇతర చర్యల వల్ల ప్రస్తుతం తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ మెల్లమెల్లగా పెరిగిపోతోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుంటే కరోనా కేసులు కూడా పెరిగిపోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక తెలంగాణలో ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కరోనా కలకలం రేపుతోంది. ఓ కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలడం ఆందోళనకు గురి చేస్తోంది.
గత రెండు రోజులుగా తీవ్రమైన చలి, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 25 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కళాశాలలో శానిటేషన్ చేశారు. ఒకే కళాశాలలో ఇంత మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. ఇక విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో భయాందోళన వ్యక్తం అవుతుండగా, ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది.
ఇవి కూడా చదవండి: