AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్ని నెలల పాటు ఒంట్లోనే వైరస్‌.. అమెరికన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

దాదాపు రెండేళ్ల క్రితం చైనాలోని వుహాన్‌ వేదికగా పురుడు పోసుకుంది కరోనా మహమ్మారి. అప్పటి నుంచి రూపం, ఉనికిని మార్చుకుంటూ ఏదో ఒక విధంగా అందరినీ ఇబ్బంది

Omicron: కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్ని నెలల పాటు ఒంట్లోనే వైరస్‌.. అమెరికన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..
Basha Shek
|

Updated on: Dec 28, 2021 | 1:24 PM

Share

దాదాపు రెండేళ్ల క్రితం చైనాలోని వుహాన్‌ వేదికగా పురుడు పోసుకుంది కరోనా మహమ్మారి. అప్పటి నుంచి రూపం, ఉనికిని మార్చుకుంటూ ఏదో ఒక విధంగా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ వైరస్‌ మనల్ని ఇప్పట్లో వదిలివెళ్లదని స్వీయరక్షణే శ్రీరామరక్షని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్లే కరోనా సోకి కోలుకున్న వారిని కొన్ని అనారోగ్య సమస్యలు చాలాకాలం పాటు వెంటాడుతున్నాయి. కాగా ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో ప్రపంచంపై ముప్పేట దాడి చేస్తోందీ మహమ్మారి. కాగా కరోనా వైరస్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఒకసారి కరోనా బారిన పడితే వైరస్‌ కొన్ని నెలల పాటు శరీరంలోనే తిష్ట వేస్తుందని, వివిధ అవయవాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని నేషనల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కొవిడ్‌ కారణంగా మృత్యువాత పడిన 44 మంది మృతదేహాలపై కొన్ని రోజుల పాటు ఈ అధ్యయనం నిర్వహించగా పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మెదడులో ఏడు నెలలు తిష్ట.. ‘కరోనా సోకిన తర్వాత సుమారు ఏడున్నర నెలల ( 230 రోజులు) పాటు వైరస్‌ ఒంట్లోనే ఉంటుంది. ఈసమయంలో గుండె, మెదడుతో పాటు పలు శరీర అవయవాల్లోనూ ఈ మహమ్మారి ఆనవాళ్లు కనిపించాయి. ప్రధానంగా శ్వాసకోశ అవయవాల్లో వైరస్‌లోడ్‌ (97.7శాతం) ఎక్కువగా ఉంది. ఆతర్వాత గుండె, మెదడు, రక్తనాళ కణజాలాలు, లింఫోయిడ్, జీర్ణాశయం కణజాలాలు, మూత్ర పిండాలు, ఎండోక్రైన్‌ కణజాలాల్లో ఈ వైరస్‌ కనిపించింది. చర్మం, పునరుత్పత్తి కణజాలాలు, కొవ్వుల్లోనూ ఈ మహమ్మారి గుర్తులు కనిపించాయి. మెదడుకు సంబంధించిన కణజాలాల్లో అయితే సుమారు ఏడు నెలల వరకు ఉంటుంది. లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్నవారిలోనూ వైరస్‌ సుదీర్ఘకాలంపాటు తిష్ట వేసుకుని ఉంటుంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్‌ శరీరంలోని పలు అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్న సైంటిస్టులు.. ఊపిరితిత్తుల్లో మాత్రం ఎలాంటి ఇన్ఫెక్షన్లను గుర్తించలేదని చెప్పడం గమనార్హం.

Also Read:

Kurnool: పుల్లారెడ్డి మిఠాయిల దుకాణంలో చోరీ.. నగదుతో పాటు స్వీట్స్‌ కూడా అపహరించుకెళ్లిన దొంగ..

Rajinikanth: మరోసారి మంచి మనసు చాటుకున్న రజనీకాంత్.. పేద విద్యార్థుల కోసం..

Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్‌ ఫ్రూట్‌ దోసె.. ఎక్కడ దొరుకుతుందంటే..