Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసె.. ఎక్కడ దొరుకుతుందంటే..
దోసె.. దక్షిణాది భారతీయులు ఇష్టంగా తినే ఆహార వంటకాల్లో ఇది కూడా ఒకటి. చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఈ డిష్‌ను ఎంచుకుంటారు. ఇందులో మసాలా దోసె, ఆనియర్‌దోసె, ఎగ్ దోసె,
దోసె.. దక్షిణాది భారతీయులు ఇష్టంగా తినే ఆహార వంటకాల్లో ఇది కూడా ఒకటి. చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఈ డిష్‌ను ఎంచుకుంటారు. ఇందులో మసాలా దోసె, ఆనియర్‌దోసె, ఎగ్ దోసె, రవ్వ దోసె, పేపర్ రోస్ట్ దోసె, నెయ్యి దోసె, పన్నీర్ దోసె.. ఎన్నో రకాలున్నాయి. అయితే ఢిల్లీలో ఒక వ్యాపారి నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసెను తయారుచేస్తున్నాడు. అక్కడి గీతాకాలనీలో ఉన్న ‘అయ్యర్‌జీ దోసె వాలే’ హోటల్‌లో ఈ వెరైటీ దోసె దొరుకుతుంది. ఇతర దోసలతో పోల్చుకుంటే ఈ దోస తయారీ కొంచెం వేరుగా ఉంటుంది. ముందు మంట పెనం మీదకు వచ్చేలా చేసి ఆతర్వాత దోసె పిండీని వేస్తారు. ఆతర్వాత వెన్నతో గ్రీజ్ చేస్తాడు. అనంతరం పన్నీర్, సాస్‌లు, మసాలా పదార్థాలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు కొన్ని రకాల పండ్ల ముక్కలు జోడిస్తాడు.
చివరిగా దోసెను తురిమిన ఛీజ్‌తో టాప్ చేసి ముగిస్తాడు. కాగా ఈ దోసెను రుచి చూడడానికి అక్కడి స్థానికులు ఎగబడుతున్నారట. కాగా ఈ ఫైర్ ఫ్రూట్ దోసె తయారీకి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అర్జున్ చౌహాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నరకాలుగ స్పందిస్తున్నారు. ‘క్రేజీ ఫుడ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇలాగే ‘ఫైర్ దోసె’ ను తయారీ చేసి వార్తల్లో నిలిచాడు.
View this post on Instagram
Also Read:
Mohit Sharma: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా క్రికెటర్.. బుజ్జాయి పుట్టాడంటూ భావోద్వేగం..
ENG vs AUS: మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయం.. యాషెస్ ఆసీస్ కైవసం..