ENG vs AUS: మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయం.. యాషెస్ ఆసీస్ కైవసం..
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో మట్టి కరిపించింది.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. తద్వారా ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను మరోసారి కైవసం చేసుకుంది. కాగా ఈ టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగియడం గమనార్హం. 31/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల ముందు చతికిల పడింది. కేవలం 37 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ 28, బెన్‌స్టోక్స్ 11 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో కేవలం 68 పరుగులకే ఇంగ్లండ్ జట్టు చాప చుట్టేసింది.
కాగా ఈ టెస్టులో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 4 ఓవర్లు వేసిన ఈ స్పీడ్‌స్టర్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు నేల కూల్చాడు. మిషెల్ స్టార్క్ మూడు వికెట్లతో మెరిశాడు. కాగా అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 267 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ హారిస్ 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వార్నర్ (32), ట్రెవిస్ హెడ్ (27), స్టార్క్ (24) రాణించారు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను చుట్టేసిన స్కాట్ బోలాండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నాలుగో టెస్ట్ జనవరి 4 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది.
What a journey for Scott Boland ? #Ashes pic.twitter.com/eWPugf8t1K
— 7Cricket (@7Cricket) December 28, 2021
Also Read:
Pushpa: సామ్ స్పెషల్ సాంగ్‌ను క్యూట్‌గా పాడిన చిన్నారి.. సమంత రియాక్షన్ ఏంటంటే..
Nani: సినిమా గురించి ప్రేమ లేఖలు రాస్తున్నారు.. ఇదే అతిపెద్ద సక్సెస్.. నాని ఎమోషనల్ కామెంట్స్..