AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohit Sharma: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా క్రికెటర్‌.. బుజ్జాయి పుట్టాడంటూ భావోద్వేగం..

టీమిండియా క్రికెటర్‌ మోహిత్‌ శర్మ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని సతీమణి శ్వేత సోమవారం పండంటి మగ బిడ్డను ప్రసవించింది

Mohit Sharma: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా క్రికెటర్‌.. బుజ్జాయి పుట్టాడంటూ భావోద్వేగం..
Basha Shek
|

Updated on: Dec 28, 2021 | 9:44 AM

Share

టీమిండియా క్రికెటర్‌ మోహిత్‌ శర్మ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని సతీమణి శ్వేత సోమవారం పండంటి మగ బిడ్డను ప్రసవించింది. కాగా తాము అమ్మానాన్నలమయ్యామన్న శుభవార్తను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుని మురిసిపోయారీ మోహిత్‌ దంపతులు. పిల్లాడిని తమ చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ ఈ ప్రపంచంలోకి స్వాగతం. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మాకు అబ్బాయి పుట్టిన విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు మేమెంతో గర్విస్తున్నాం ‘ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. ఈ క్రమంలో క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్ల నుంచి మోహిత్‌ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా హర్యానాకు చెందిన మోహిత్‌ శర్మ 2013 ఆగస్టులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా 26 వన్డేల్లో 31 వికెట్లు నేలకూల్చాడు. 4 టీ20 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. చివరిసారిగా 2015లో భారత్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన సీనియర్‌ బౌలర్‌ ఎక్కువ కాలం టీమిండియాలో కొనసాగలేకపోయాడు . ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌, ఢిల్లీ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు మోహిత్‌. మొత్తం 86 మ్యాచ్‌లు ఆడి 92 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అతని వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2016లో శ్వేతను పెళ్లాడాడు మోహిత్‌ శర్మ. ఐదేళ్ల తర్వాత తల్లిదండ్రలుగా ప్రమోషన్‌ పొందారు.

Also Read:

ENG vs AUS: మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం.. యాషెస్‌ ఆసీస్‌ కైవసం..

Vijay Deverakonda: సోషల్‌ మీడియాలో మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన టాలీవుడ్‌ రౌడీ.. బన్నీ తర్వాతి స్థానంలో..

Pushpa: సామ్‌ స్పెషల్ సాంగ్‌ను క్యూట్‌గా పాడిన చిన్నారి.. సమంత రియాక్షన్‌ ఏంటంటే..

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం