AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: సోషల్‌ మీడియాలో మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన టాలీవుడ్‌ రౌడీ.. బన్నీ తర్వాతి స్థానంలో..

టాలీవుడ్ రౌడీ, యంగ్ హీరో విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో 'అర్జున్‌ రెడ్డి' సినిమాతో

Vijay Deverakonda: సోషల్‌ మీడియాలో మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన టాలీవుడ్‌ రౌడీ.. బన్నీ తర్వాతి స్థానంలో..
Basha Shek
|

Updated on: Dec 28, 2021 | 8:08 AM

Share

టాలీవుడ్ రౌడీ, యంగ్ హీరో విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆతర్వాత ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అమ్మాయిల్లోనూ ఈ యంగ్‌ హీరోకూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన ప్రవర్తనతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ యంగ్‌ సెన్సేషన్‌. అతను పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలకు లక్షల మంది లైకులు, కామెంట్లు కురిపిస్తుంటారు. అందుకే సోషల్‌ మీడియాలో అతనిని అనుసరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల ఫాలోవర్స్‌ తో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేశాడీ రౌడీ హీరో.

కాగా టాలీవుడ్‌ ఐకాన్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా 14 మిలియన్ల ఫాలోవర్స్‌తో బన్నీ తర్వాతి స్థానంలో నిలిచాడు విజయ్‌. ఈ సందర్భంగా రౌడీ హీరోకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. అదేవిధంగా #14MRowdiesOnInsta పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యా పాండే రౌడీతో రొమాన్స్ చేయనుంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Pushpa: సామ్‌ స్పెషల్ సాంగ్‌ను క్యూట్‌గా పాడిన చిన్నారి.. సమంత రియాక్షన్‌ ఏంటంటే..

Telugu Indian Idol: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌కి భారీ రెస్పాన్స్.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌

Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…