AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Indian Idol: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌కి భారీ రెస్పాన్స్.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌

తెలుగు తొలి ఓటీటీ సంస్థ ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‏తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్,

Telugu Indian Idol: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌కి భారీ రెస్పాన్స్.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌
India Idol
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2021 | 7:18 AM

Share

తెలుగు తొలి ఓటీటీ సంస్థ ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‏తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, సూపర్ హిట్ చిత్రాలను మాత్రమే కాకుండా.. ఇతర భాషల నుంచి సినిమాలను డబ్ చేస్తూ… ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. ఇక స్టా్ర్ హీరోలతో టాక్ షోస్ నిర్వహిస్తూ… డిజిటల్ ప్లాట్ ఫాంలో టాప్‏లో దూసుకుపోతుంది. తాజాగా ఆహా సరికొత్త ప్రయత్నం చేస్తుంది. హిందీలో సూపర్ హిట్ షో ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంను ఆహా తెలుగులో తీసుకువస్తుంది.

100% తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా..  ఇక తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది ఆహా ఓటీటీ. ఇందుకు తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది ఆహా!. అందులో భాగంగా, 12 సీజ‌న్ల‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన ఇండియ‌న్ ఐడ‌ల్ ప్లాట్‌ఫార్మ్‌ని ద‌క్షిణాదిన తొలి సారిగా, మ‌న తెలుగులో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పేరుతో ప్రారంభిస్తోంది ఆహా. నాన్‌-ఫిక్ష‌న్ స్పేస్‌లో ప్రారంభం కానున్న ఈ షో గురించి ఇప్ప‌టికే జనాల్లో క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. ఈ సింగింగ్ కాంపిటిష‌న్స్ ఆడిష‌న్స్ కూడా పూర్తయ్యాయి.

Telugu Indian Idol

Telugu Indian Idol

ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్‌గా నిలిచి తెలుగువారికి ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన శ్రీరామ్ చంద్ర .. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే అంశం. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ కోసం ఆన్ లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ ఆడిష‌న్స్ జరిగాయి. తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌లో పాల్గొనడానికి పాటించాల్సిన గైడ్ లైన్స్‌ను ఆహా విడుదల చేయగా.. వాటిని పాటిస్తూ..ఈ ఆడిషన్స్‌కు 5వేలకు పైగా కంటెస్టెంట్స్ పాల్గొనడం విశేషం. ఇంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే, తెలుగు ఇండియన్ ఐడల్‌కు ఉన్న క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక త్వరలోనే తెలుగు సినీ ప్రేమికులను అలరించబోతున్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు.

2021లో ఆహాలో ఇప్పటికే లవ్‌స్టోరీ, అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే, త్రీ రోసెస్‌, ఒన్‌, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, అనుభవించురాజా, సర్కార్‌, చెఫ్‌ మంత్ర, ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ, క్రాక్‌, అల్లుడు గారు, లెవన్త్ హవర్‌, నాంది, సూపర్‌ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచట వాహనములు నిలపరాదు.. ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

Also Read: RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..

Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…

Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!