Siva Karthikeyan: హాలీవుడ్ సినిమాలకు పోటీగా మనం కూడా.. ఆ ఇద్దరూ రెండు సింహాల్లాగే ఉన్నారు.. తమిళ్ స్టార్ హీరో కామెంట్స్..
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలతో రాజమౌళి మూవీ చేస్తుండడంతో మొదటి నుంచి ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీ కోసం ఇద్దరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిన్న చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. ఉదయనిది స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. రాజమౌలి.. తారక్, చరణ్ లను ప్రశంసలతో ముంచెత్తాడు. ఆయన మాట్లాడుతూ.. నేను రాజమౌళి గారికి పెద్ద ఫ్యాన్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని నన్ను ఆహ్వానించగానే చాలా ఆనందమేసింది. ఎప్పుడెప్పుడు వద్దామా ? అని వెయిట్ చేశాను. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మగధీర సినిమా చూసినప్పటినుంచి ఆయన అభిమానిగా మారిపోయాను. ఈగ సినిమా చూసి చిన్న ఈగతోనే ఇలాంటి సినిమా తీశారు. ఇంక మనతో ఎలాంటి మూవీస్ చేస్తారు అనుకున్నాను.
అలాగే ఎన్టీఆర్, చరణ్ రెండు సింహాల్లాగా కనిపిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఒక్కోక్కరినీ ఒక్కోక్క షాట్లో చూస్తుంటే గూస్బమ్స్ వచ్చేస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూశామన్నా భావన కలుగుతుంది. ఇలాంటి సినిమాలు వస్తేనే ప్రజలు థియేటర్లకు వస్తారు. వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే నేను చూస్తాను. అంత క్యూరియాసిటీతో ఉన్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా మనమందరం గర్వపడే సినిమా. హాలీవుడ్ సినిమాలకు పోటీగా మనం కూడా చిత్రాలను తెరకెక్కిస్తున్నాం. దక్షిణాది, ఉత్తరాది అని లేకుండా ఇండియన్ సినిమా అనే భావన వచ్చేలా ఈ సినిమా తీశారు. మనం గౌరవం ఇవ్వాలి అన్నారు శివకార్తికేయన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ శరన్ కీలకపాత్రలలో నటించారు.
Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…