Nani: సినిమా గురించి ప్రేమ లేఖలు రాస్తున్నారు.. ఇదే అతిపెద్ద సక్సెస్.. నాని ఎమోషనల్ కామెంట్స్..

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఇందులో నాని సరసన

Nani: సినిమా గురించి ప్రేమ లేఖలు రాస్తున్నారు.. ఇదే అతిపెద్ద సక్సెస్.. నాని ఎమోషనల్ కామెంట్స్..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 28, 2021 | 8:38 AM

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‏గా నిలిచింది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‏లో సక్సెస్ మీట్ నిర్వహించింది శ్యామ్ సింగరాయ్ చిత్రయూనిట్. ఈ వేడుకకు నిర్మాత దిల్ రాజు, ఆర్ నారయణ మూర్తి, నిర్మాత వెంకట్ బోయినపల్లి విచ్చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సినిమా బాగుందని అందరూ ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘సినిమా బాగుంది అని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. లవ్ లెటర్‌లా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులున్నా కూడా మంచి సినిమాను ఆదరిస్తామని ప్రతీ సారి నిరూపిస్తూనే ఉన్నారు. మీరున్నంత వరకు, మీ నుంచి ఈ ప్రోత్సాహం ఉన్నంత వరకు మీకు మంచి సినిమాలు ఇచ్చేందుకు ప్రాణం పెట్టి పని చేస్తాం. మొదటి నుంచి అండగా ఉన్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ క్యాస్టూమ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నీరజ కోన గారు అద్భుతంగా పని చేశారు. అభినవ్ సినిమాలన్నీ చూశాను. కానీ ఆయనతో ఇంత వరకు నటించలేదు. వేరే హీరోను నా పేరుతో పిలిచాడు. అంటే నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాడేమో. శ్యామ్ సింగ రాయ్ బేసిక్ ఐడియాలో చాలా బలం ఉండాలి. అలాంటి కథను అందించిన సత్యదేవ్ గారికి థ్యాంక్స్. మీరు ఇలాంటి సమయం కోసం ఎన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. శ్యామ్ సింగ రాయ్‌తో అది నిజమైనందుకు సంతోషంగా ఉంది.

శ్యామ్ సింగ రాయ్ వంటి పెద్ద సినిమా, ఇంత కాస్టింగ్‌, పెద్ద బాధ్యతను రాహుల్ మీద పెట్టాం. ఇండస్ట్రీలో చాలా మంది నమ్మలేదు. కానీ అందరి అంచనాలు తప్పు అని నిరూపించాడు. ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి. రాజమౌళికి గారికి రాహుల్‌ను పరిచయం చేశాను. రాజమౌళి గారే రాహుల్ స్పూర్తి అన్నాడు. అది నేను విన్నాను. ఆయన దారిలోనే నువ్ వెళ్లున్నావ్.. ఆ గ్యాప్ తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది. దిల్ రాజు గారు శ్యామ్ సింగ రాయ్ ముందు రోజే చూశారు. థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పారు. ఆయన చెప్పినట్టే జరుగుతోంది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ మాకు ఇంత సాయం చేసినందుకు థ్యాంక్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఈ నెల అంతా బాగుంది. అన్ని పరిస్థితులు చక్కబడి ఈ ఊపు ఏదైతే ఉందో వచ్చే ఏడాది.. ఇంకా పదేళ్లు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి పల్లవి విషయంలో.. చుట్టూ ముళ్లున్నా అందరికీ అందాన్ని, ఆనందాన్ని పంచే రోజాపువ్వు నువ్వు.. అన్న డైలాగ్ కరెక్టేనేమో. ప్రణవాళయం అనే పాట ఎలాంటి పరిస్థితుల్లో చేసిందో మా అందరికీ తెలుసు. అయినా కూడా ఆ మొహంలో చిరునవ్వు మాత్రం చెరగనివ్వదు. సాయి పల్లవి పేరు రోజీగా మారిపోయింది. సఖిలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు కూడా ఎప్పటికీ అలా నిలిచిపోయే కథ రావాలనే కోరిక ఉండేది.

సూపర్ హిట్ లవ్ స్టోరీలు, బ్లాక్ బస్టర్ హిట్ లవ్ స్టోరీలున్నాయి. కానీ ఎప్పటికీ నిలిచిపోయే లవ్ స్టోరీలు లేవనే బాధ ఉండేది. కానీ శ్యామ్ బాబు, రోజీలు ఆ కోరిక తీర్చారు. నారాయణ మూర్తి గారి స్పీచ్ వల్లే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. మా నిర్మాత వెంకట్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. వెంకట్ గారికి నాని దొరికాడు అని అంతా అనుకుంటారు.. కానీ నానికే వెంకట్ గారు దొరికారు. ఆయన వంద సినిమాలు తీయాలి.. అందులో నాతో యాభై చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆర్ నారాయణమూర్తి గారు మొదటగా వచ్చి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు బ్రదర్ అని అడిగారు. అంత కంటే సక్సెస్ ఏమీ ఉండదు. సాను లేకపోతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నా రెండు మెమోరబుల్ సినిమాలను అందించారు. సెకండాఫ్ ఎప్పుడైందో కూడా తెలీడం లేదని అంటున్నారు. నవీన్ గారి ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌లో మిక్కీ గారి పాత్ర ఎంతో ఉంది. సిరివెన్నెల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ పాత్రలకు మంచి పేరు వచ్చింది. టీం అందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. న్యూ ఇయర్ కూడా మనదే’ అని అన్నారు.

Also Read: RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..

Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…

Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..