ENG vs AUS: యాషెస్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్.. 13వ సారి అద్భుత ఫీట్‌తో సెకండ్ ప్లేస్..!

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 267 పరుగులకే పరిమితం చేశాడు. దీంతో ఆయన పేరిట ఓ ప్రత్యేక రికార్డు నమోదైంది.

ENG vs AUS: యాషెస్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్.. 13వ సారి అద్భుత ఫీట్‌తో సెకండ్ ప్లేస్..!
Eng Vs Aus; James Anderson
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Dec 28, 2021 | 7:15 AM

Ashes 2021: ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడినా.. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ ప్రదర్శన నిరాశపరచడంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోతే సిరీస్‌ కూడా చేజారిపోతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో పాటు ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.

అండర్సన్ పేరిట నమోదైన రికార్డులు.. 1. జేమ్స్ అండర్సన్ తన యాషెస్ చరిత్రలో 13వ సారి ఒక ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన రెండో ఇంగ్లీష్ బౌలర్‌గా నిలిచాడు. అతను సిడ్నీ బర్న్స్, బాబీ పీల్‌లతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచాడు. 14 సార్లు ఈ ఘనత సాధించిన ఇయాన్ బోథమ్ ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.

2. యాషెస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ నాలుగో స్థానంలో నిలిచాడు. మూడో మ్యాచ్‌లో విల్‌ఫ్రెస్ రోడాస్ (109 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఈ చారిత్రాత్మక సిరీస్‌లో అతని పేరిట 111 వికెట్లు నమోదయ్యాయి.

3. టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను ఆండర్సన్ ఎనిమిదోసారి పెవిలియన్‌కు పంపాడు. దీంతో అతను స్టువర్ట్ బ్రాడ్‌ను సమం చేశాడు. ఈ విషయంలో పాకిస్థాన్‌కు చెందిన యాసిర్ షా రెండో స్థానంలో ఉన్నాడు. యాసిర్ ఇప్పటివరకు స్మిత్‌ను ఏడుసార్లు పెవిలియన్‌కు పంపాడు.

మూడో టెస్టులో పట్టు బిగించిన ఆస్ట్రేలియా.. బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ కేవలం 185 పరుగులకే కుప్పకూలింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్ ఫ్లాప్ షో కొనసాగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించగలిగితే, సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంది.

Also Read: Cricket News: వారెవ్వా.. సూపర్‌ సిక్స్‌.. షాట్‌ చూసిన ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు ఫిదా అయ్యారు..

Rohit Sharma: రోహిత్‌ వన్డే సిరీస్‌కి కూడా దూరమేనా..! అప్పుడు వన్డే కెప్టెన్ ఎవరు..?