Rohit Sharma: రోహిత్‌ వన్డే సిరీస్‌కి కూడా దూరమేనా..! అప్పుడు వన్డే కెప్టెన్ ఎవరు..?

Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ అయిన వెంటనే రోహిత్ శర్మకు గాయం అయింది. దీంతో దక్షిణాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు

Rohit Sharma: రోహిత్‌ వన్డే సిరీస్‌కి కూడా దూరమేనా..! అప్పుడు వన్డే కెప్టెన్ ఎవరు..?
Kl Rahul
Follow us
uppula Raju

|

Updated on: Dec 27, 2021 | 8:21 PM

Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ అయిన వెంటనే రోహిత్ శర్మకు గాయం అయింది. దీంతో దక్షిణాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు కానీ ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా ఆడడం కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ తొడకండరాలు పట్టేయడంతో ఇబ్బందిపడుతన్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. స్పోర్ట్స్ టుడే వార్తల ప్రకారం.. రోహిత్ శర్మ ఇంకా ఫిట్‌గా లేడని అందుకే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కి టీమిండియాను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని తెలిసింది. రోహిత్ శర్మ ఫిట్ నెస్ కోసం సెలక్షన్ కమిటీ చివరి క్షణం వరకు వేచి చూస్తోంది.

మీడియా కథనాల ప్రకారం.. రోహిత్ శర్మ ఫిట్‌గా లేకుంటే వన్డే సిరీస్‌లో అతని స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడాలి. రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా వన్డే సిరీస్‌కు ఫిట్‌గా ఉండటం కష్టమని పేర్కొంది. ఈ గాయం నయం కావడానికి 4 నుంచి 6 వారాలు పడుతుంది. మరి రోహిత్ శర్మ ఎంతకాలం ఫిట్‌గా ఉంటాడో చూడాలి. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు సెలక్టర్లు విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. వైట్ బాల్ ఫార్మాట్‌లో ఒకే ఒక్క కెప్టెన్ ఉండాలని సెలక్టర్లు విశ్వసించారు. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు ఆ తర్వాత వన్డే కెప్టెన్సీని కూడా కోల్పోయాడు.

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‎లో నిరాశపరిచాడు. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్గిడికి చిక్కాడు. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు 71వ సెంచరీ చేయడం కోసం కోహ్లీ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.

బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. నో వేస్ట్.. నో రెస్ట్.. బెస్ట్ ఆఫర్ చేసిన ఓ చైనా సంస్థ..

జాతకంలో శుక్రుడు బలంగా లేకుంటే డబ్బుకు లోటు..! ఇలా చేస్తే శుభ పరిణామాలు

Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్.. మాకు ఇష్టమైన చిరుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!