AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకంలో శుక్రుడు బలంగా లేకుంటే డబ్బుకు లోటు..! ఇలా చేస్తే శుభ పరిణామాలు

Spiritua News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం శుభ గ్రహంగా చెబుతారు. అది బలంగా లేకుంటే తరచుగా ఒక వ్యక్తి జీవితంలో సంపద, కీర్తి కోల్పోతాడు

జాతకంలో శుక్రుడు బలంగా లేకుంటే డబ్బుకు లోటు..! ఇలా చేస్తే శుభ పరిణామాలు
Shukra Grah
uppula Raju
|

Updated on: Dec 27, 2021 | 8:02 PM

Share

Spiritua News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం శుభ గ్రహంగా చెబుతారు. అది బలంగా లేకుంటే తరచుగా ఒక వ్యక్తి జీవితంలో సంపద, కీర్తి కోల్పోతాడు అంతేకాదు ధనం నిలకడగా ఉండదు. శాస్త్రాల ప్రకారం జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే జీవితంలో ఆనందం వెళ్లివిరుస్తుంది. కానీ అది బలహీనంగా ఉంటే డబ్బు లేకపోవడం, వ్యక్తి కుంగిపోవడం జరుగుతుంది. దీంతో పాటు శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే శుక్రుడి అనుగ్రహం సంపాదించాలంటే కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1. శుక్రుడు బలపడాలంటే పంచదార, అన్నం, పాలు, నెయ్యితో చేసిన ఆహారం తినాలని పండితులు సూచించారు. అయితే ఆరోగ్య సమస్యలున్నవారు దీనిని నివారించాలి.

2. శుక్రవారం ఓం శుక్రాయ నమః మంత్రాన్నిజపించాలి. ఇలా చేస్తే శుక్రుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

3. శుక్రుడు బలహీనంగా ఉన్నవారు 21 శుక్రవారాలు ఉపవాసం పాటించడం మంచిది. దీనివల్ల శుక్రుడు బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

4. వాస్తు శాస్త్రం ప్రకారం.. శుక్రుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు వజ్రాలు ధరించాలి. ఇది జాతకంలో శుక్ర గ్రహాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

5. సోదరిమణులకు తెల్ల చందనం, తెల్లబియ్యం, తెల్లని వస్త్రాలు, తెల్లటి పువ్వులు, వెండి, నెయ్యి, పెరుగు, పంచదార, దక్షిణ మొదలైన వాటిని దానం చేస్తే విముక్తి లభిస్తుంది.

6. శుక్రుడు బలహీనంగా ఉన్న వారు మెడలో వెండి కంకణం లేదా రాగి హారాన్ని ధరించాలి. తెల్లని పుష్యరాగం ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

Vastu Tips: కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండాలంటే 5 వాస్తు చిట్కాలు..! ఏంటో తెలుసుకోండి..?

అభిమానం పీక్‌ స్టేజ్‌కి చేరింది.. ముఖానికి 30 సార్లు సర్జరీ చేయించింది..

ఈ సింగర్‌ హృదయం చాలా విశాలమైంది.. ఏకంగా కోటి 27 లక్షల విరాళం ప్రకటించింది..