- Telugu News Photo Gallery Spiritual photos These 5 vastu tips in the new year happiness and prosperity will come in the house
Vastu Tips: కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండాలంటే 5 వాస్తు చిట్కాలు..! ఏంటో తెలుసుకోండి..?
Vastu Tips: కొత్త సంవత్సరం కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో అభివృద్ది చెందాలని కోరుకుంటారు. దీనికి కొంత అదృష్టం కూడా తోడవ్వాలి. మీరు ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే శుభం జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Updated on: Dec 27, 2021 | 10:36 AM

ఇంట్లోకి సానుకూల, ప్రతికూల శక్తులు రెండూ ప్రధాన ద్వారం నుంచే వస్తాయి. సానుకూల శక్తిని ఆహ్వానించడానికి, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండటానికి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ చిహ్నం ఉంచండి.

కుబేరుడు ఉత్తరాన నివసిస్తాడు కాబట్టి ఈ దిశలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహాన్ని పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఉండదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని తీసుకురావడానికి తూర్పు దిశలో మొక్కలను నాటాలి. నూతన సంవత్సరం రోజున మొక్కలకు నీళ్ళు పోయడం వల్ల సంపద, సోదరభావం కలుగుతాయి.

ఇంట్లో సంపద, శ్రేయస్సు కోసం ఉత్తర దిశ చాలా ముఖ్యమైనది. చిరిగిన దుస్తులు, చెత్త, విరిగిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ దిశలో ఎప్పుడూ ఉంచవద్దు.

వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం రోజు సాయంత్రం ఆలయంలో పూజలు చేసిన తర్వాత గంగాజలం ఇంటి అంతటా చల్లుకోవాలి. ఈ రోజున పూజగదిలో శంఖాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం.



