అభిమానం పీక్‌ స్టేజ్‌కి చేరింది.. ముఖానికి 30 సార్లు సర్జరీ చేయించింది..

Cosmetic Operations: ప్రపంచంలో చాలా మంది స్టార్స్‌ ఉన్నారు. వారి హెయిర్‌ స్టైల్‌, ఫ్యాషన్‌, దుస్తులను ప్రజలు చాలా ఇష్టపడతారు. అంతేకాదు ఇందులో

అభిమానం పీక్‌ స్టేజ్‌కి చేరింది.. ముఖానికి 30 సార్లు సర్జరీ చేయించింది..
Francisco
Follow us
uppula Raju

|

Updated on: Dec 27, 2021 | 9:57 AM

Cosmetic Operations: ప్రపంచంలో చాలా మంది స్టార్స్‌ ఉన్నారు. వారి హెయిర్‌ స్టైల్‌, ఫ్యాషన్‌, దుస్తులను ప్రజలు చాలా ఇష్టపడతారు. అంతేకాదు ఇందులో చాలా మంది వారిని అనుకరిస్తారు. ‘తేరే నామ్‌’ సినిమా వచ్చినప్పుడు సల్మాన్‌ ఖాన్‌ హెయిర్‌స్టైల్‌ బాగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. గ్రామం నుంచి పట్టణం వరకు యువత ఆ హెయిర్‌స్టైల్‌ని కాపీ కొట్టడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇతగాడు ఇష్టమైన గాయకుడిలా కనిపించడానికి ఏకంగా ముఖానికి 30 సార్లు సర్జరీ చేయించుకున్నాడు.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సంగతేంటో తెలుసుకుందాం. ఈ 33 ఏళ్ల వ్యక్తి పేరు ఫ్రాన్సిస్కో మరియానో ​​జేవియర్ ఇబానెజ్. నివేదికల ప్రకారం.. రికీ మార్టిన్ లాగా కనిపించడానికి ఫ్రాన్సిస్కో ముఖానికి అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. రికీ మార్టిన్ ప్రపంచ ప్రసిద్ధ పాటల రచయిత, గాయకుడు. 90వ దశకంలో ఆయన పాటలు ప్రపంచాన్నిఒక ఊపు ఊపాయి. రికీ మార్టిన్ అంటే ఫ్రాన్సిస్కోకు చాలా ఇష్టం. తనని రికీ మార్టిన్‌లా కనిపిస్తున్నావని చాలా మంది ఫ్రాన్సిస్కోకు చెప్పేవారు అప్పటి నుంచి అతను రికీ మార్టిన్‌లా కనిపించడానికి ప్రయత్నించాడు. ప్లాస్టిక్ సర్జరీలు చేస్తే ముఖం అతడిలా మార్చుకోవాలనుకున్నాడు.

మీడియా కథనాల ప్రకారం.. ఫ్రాన్సిస్కో తన ముఖానికి ఇప్పటివరకు 30 సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాని కోసం దాదాపు 7 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. అయితే ఇప్పుడు తాను చేసిన తప్పు గ్రహించాడు. తాను ఎప్పటికీ రికీ మార్టిన్‌లా మారలేనని తెలుసుకున్నాడు. ఇప్పుడు తనలాంటివారు ఎవరైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయకండని చెబుతున్నాడు.

ఈ సింగర్‌ హృదయం చాలా విశాలమైంది.. ఏకంగా కోటి 27 లక్షల విరాళం ప్రకటించింది..

E-Shram: ఈ-శ్రమ్‌ కార్డు కార్మికులకు ఒక వరం..! ఖరీదైన ఆరోగ్యం, పిల్లల చదువు ఇంకా చాలా..?

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే చాలా ప్రయోజనాలు.. అధిక వడ్డీ, పన్ను ప్రయోజనం ఇంకా..?

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్