AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సింగర్‌ హృదయం చాలా విశాలమైంది.. ఏకంగా కోటి 27 లక్షల విరాళం ప్రకటించింది..

Hotel Del Luna Star IU: కొరియన్ గాయని IU తన పాటలతో కుర్రకారును హుషారెత్తిస్తుంది. దీంతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ సింగర్‌ హృదయం చాలా విశాలమైంది.. ఏకంగా కోటి 27 లక్షల విరాళం ప్రకటించింది..
Korean Singer Iu
uppula Raju
| Edited By: |

Updated on: Dec 27, 2021 | 7:05 PM

Share

Hotel Del Luna Star IU: కొరియన్ గాయని IU తన పాటలతో కుర్రకారును హుషారెత్తిస్తుంది. దీంతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. సంగీత ప్రపంచంలో ఆమె సంపాదించిన పేరు కంటే స్వచ్ఛంద కార్యక్రమాలతో అందరికి ఇష్టంగా మారింది. తాజాగా ఆమె చేసిన ఒక పని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఉదారతను తెలియజేస్తుంది. ఒక నివేదిక ప్రకారం.. ఇటీవల ఈమె కోటి 27 లక్షల రూపాయలను చైల్డ్ ఫండ్ కొరియాకు విరాళంగా ప్రకటించింది.

కొరియన్ టాబ్లాయిడ్ సంపీ తన ఏజెన్సీ EDAM ఎంటర్‌టైన్‌మెంట్ IU 100 మిలియన్లను క్యాన్సర్ రోగులకు, పేద కుటుంబాల పిల్లలకు విరాళంగా అందించిందని ధృవీకరించింది. విరాళంలో కొంత భాగాన్ని చైల్డ్‌ఫండ్ కొరియా తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలకు, శీతాకాలపు దుస్తులు, అవసరాల కోసం అందించింది. సింగర్‌ IU తన విరాళం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ శీతాకాలంలో ఒక్క పేద పిల్లవాడు కూడా వెచ్చని దుస్తులు లేకుండా ఉండకూడదన్నారు. ఇది కష్టమైన సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలని కోరతున్నానని తెలిపారు.

పేద ప్రజలకు సహాయం చేయడానికి IU ముందుకు రావడం ఇదే మొదటిసారి కాదు. ఎప్పటి నుంచో ఆమె అనేక సంస్థల ద్వారా ప్రజలకు సహాయం చేస్తుంది. IU వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మార్చిలో ఐదో స్టూడియో ఆల్బమ్ లిలక్‌ని విడుదల చేసారు. దీనికి మంచి ఆదరణ లభించింది. చివరిసారిగా 2019 ఫాంటసీ మిస్టరీ డ్రామా హోటల్ డెల్ లూనాలో కనిపించారు. ఇప్పుడు IUకి త్వరలో 29 ఏళ్లు నిండుతాయి. డిసెంబరులో ఆమె కొత్త ఆల్బమ్ పీస్. దీంతో ఆమె అభిమానుల్లో చాలా కాలంగా సందడి నెలకొంది.

E-Shram: ఈ-శ్రమ్‌ కార్డు కార్మికులకు ఒక వరం..! ఖరీదైన ఆరోగ్యం, పిల్లల చదువు ఇంకా చాలా..?

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే చాలా ప్రయోజనాలు.. అధిక వడ్డీ, పన్ను ప్రయోజనం ఇంకా..?

Salman Khan Birthday: సల్మాన్ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్ టైటిల్ వెల్లడి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!