AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Shram: ఈ-శ్రమ్‌ కార్డు కార్మికులకు ఒక వరం..! ఖరీదైన ఆరోగ్యం, పిల్లల చదువు ఇంకా చాలా..?

E-Shram: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలు మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా

E-Shram: ఈ-శ్రమ్‌ కార్డు కార్మికులకు ఒక వరం..! ఖరీదైన ఆరోగ్యం, పిల్లల చదువు ఇంకా చాలా..?
E Shram
uppula Raju
|

Updated on: Dec 27, 2021 | 8:59 AM

Share

E-Shram: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలు మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా ఈ-శ్రమ్ పోర్టల్ కూడా ప్రారంభించింది. దీని ద్వారా వ్యక్తుల డేటాను కూడా తయారు చేస్తుంది. ఇందులో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఈ-శ్రామ్ కార్డ్ వస్తుంది. దీని ద్వారా మీరు ప్రభుత్వం ప్రారంభించిన అన్ని పథకాల ప్రయోజనాన్ని పొందడమే కాకుండా భవిష్యత్తులో ప్రారంభించే పథకాల ప్రయోజనాన్ని కూడా పొందగలరు. కానీ ఇప్పటికీ అసంఘటిత రంగంలో చాలా మంది కార్మికులు ఇందులో పేరు నమోదు చేసుకోలేదు. వెంటనే మీరు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లి, ఎప్పుడైనా e-Shram పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చు.

రోజువారీ ఆదాయాన్ని సంపాదించే వ్యక్తులు చాలా రకాల భయాలను కలిగి ఉంటారు. ఎందుకంటే ఆదాయం సక్రమంగా ఉండదు. ఈ శ్రమ్‌లో పేరు నమోదు చేసుకుంటే మీరు అన్ని పథకాలకు అర్హులు అవుతారు. దీని ద్వారా ఉపాధి పొందవచ్చు. కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సమయంలో ఎటువంటి డబ్బు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో చేరితే అన్ని పథకాలు మీ దరకి చేరుతాయి. దీని కింద మీరు ఖరీదైన చికిత్స కోసం ఆర్థిక సహాయం కూడా పొందుతారు. భవిష్యత్తులో ఏ కార్మికుడైనా వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంటే అతను కార్డు ద్వారా చికిత్సలో ఆర్థిక సహాయం పొందుతాడు.

ప్రస్తతం పిల్లల చదువు చాలా ఖరీదైనది. అటువంటి పరిస్థితిలో కార్మికులు e-shram కార్డ్ ద్వారా పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం పొందవచ్చు. దీంతో పాటు ప్రభుత్వం ప్రారంభించిన అన్ని పథకాల కింద ఇంటిని నిర్మించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకారం.. భారతదేశంలోని అసంఘటిత రంగంలోని ప్రతి మూడో కార్మికుడు ఇప్పుడు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదయ్యాడు. ఇప్పటివరకు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు సంఖ్య 14 కోట్లు దాటింది. పోర్టల్ తాజా డేటా ప్రకారం.. రిజిస్ట్రేషన్ పరంగా మొదటి ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ ఉన్నాయి.

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే చాలా ప్రయోజనాలు.. అధిక వడ్డీ, పన్ను ప్రయోజనం ఇంకా..?

Salman Khan Birthday: సల్మాన్ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్ టైటిల్ వెల్లడి..

Honey: తేనె ఎందుకు పాడవదు.. తేనె టీగలు ఎలా తయారుచేస్తాయి.. దీని వెనుకున్న సీక్రెట్‌ ఏంటి..?