AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey: తేనె ఎందుకు పాడవదు.. తేనె టీగలు ఎలా తయారుచేస్తాయి.. దీని వెనుకున్న సీక్రెట్‌ ఏంటి..?

Honey: నిజమైన తేనె సంవత్సరాలు గడిచినా పాడవదు. దీని వెనుక ఓ రహస్యం దాగి ఉంది.ఇది తెలుసుకోవాలంటే ముందుగా తేనె ఎలా

Honey: తేనె ఎందుకు పాడవదు.. తేనె టీగలు ఎలా తయారుచేస్తాయి.. దీని వెనుకున్న సీక్రెట్‌ ఏంటి..?
Honey Benefits
uppula Raju
|

Updated on: Dec 27, 2021 | 7:56 AM

Share

Honey: నిజమైన తేనె సంవత్సరాలు గడిచినా పాడవదు. దీని వెనుక ఓ రహస్యం దాగి ఉంది.ఇది తెలుసుకోవాలంటే ముందుగా తేనె ఎలా తయారవుతుందో అర్థం చేసుకోవాలి. తేనెను సేకరించేందుకు తేనెటీగ పువ్వుల రసాన్ని పీలుస్తుంది. ఈ రసంలో అనేక రకాల చక్కెర, ప్రొటీన్లు ఇతర రసాయనాలు ఉంటాయి. ఇందులో కొంత భాగం నీరు కూడా ఉంటుంది. తేనెలో ఇంట్లో ఉండే చక్కెర మాదిరిగానే సుక్రోజ్ షుగర్ ఉంటుంది. తేనెటీగ పువ్వుల రసాన్ని శరీరంలో నింపుకుంటుంది. తరువాత దాని శరీరంలో ఉన్న ఒక గ్రంథి నుంచి ఎంజైమ్‌లు విడుదలై ఈ రసంలో కలుస్తాయి.

పువ్వుల రసం, ఎంజైమ్‌లను కలిపిన తర్వాత అది తేనెగా మారుతుంది. ఎంజైమ్‌లను పొందిన తరువాత, సుక్రోజ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా విచ్ఛిన్నమవుతుంది. తేనెలో చాలా తక్కువ నీరు ఉంటుందని శాస్త్రం చెబుతోంది. దీనిలో బ్యాక్టీరియా చేరినప్పుడల్లా సహజంగా తేనె తన నీటి మొత్తాన్ని పీల్చుకుంటుంది. కాబట్టి తేనె చెడిపోదు బ్యాక్టీరియా చనిపోతుంది. హెల్త్‌లైన్ పరిశోధన నివేదిక ప్రకారం.. తేనెటీగల శరీరం నుంచి గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఈ ఎంజైమ్ తేనెలో బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది.

తేనె పూర్తిగా సిద్ధమైనందున అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనం ఏర్పడి బ్యాక్టీరియా చేరకుండా చేస్తుంది. అన్ని రకాల తేనెలు ఒకే నాణ్యత కలిగి ఉంటాయా అనే అంటే ఎవ్వరూ చెప్పలేరు. తేనె నాణ్యత చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందని సైన్స్ చెబుతోంది. ఉదాహరణకు, తేనెటీగ జాతి, అది సేకరించిన పువ్వుల జాతిని బట్టి ఉంటుంది. సాధారణంగా తేనెలో 80 శాతం వరకు చక్కెర 18 శాతం వరకు నీరు ఉంటుంది కాబట్టి ఇది అస్సలు చెడిపోదు. ఆరోగ్యకరమైన తేనె ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది.

Corona Variants: జింకల వల్ల కరోనా కొత్త వేరియంట్‌..! హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..

Covaxin: కోవాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లల్లో పెరిగిన ఇమ్యూనిటీ..! పెద్దలలో కంటే మెరుగైన ఫలితాలు..

IND vs PAK: ఉత్కంఠ పోరులో భారత్‌పై గెలిచిన పాక్‌.. చివరి వరకు పోరాడినా ఫలితం తారుమారు..