IND vs PAK: ఉత్కంఠ పోరులో భారత్‌పై గెలిచిన పాక్‌.. చివరి వరకు పోరాడినా ఫలితం తారుమారు..

IND vs PAK: భారత్‌ పోరాటం వృథా అయింది. చివరి వరకు శ్రమించినా ఫలితం తారుమారైంది. ఉత్కంఠ పోరులో భారత్‌పై పాక్‌ 2 వికెట్ల తేడాతో

IND vs PAK: ఉత్కంఠ పోరులో భారత్‌పై గెలిచిన పాక్‌.. చివరి వరకు పోరాడినా ఫలితం తారుమారు..
Ind Vs Pak
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 26, 2021 | 8:08 AM

IND vs PAK: భారత్‌ పోరాటం వృథా అయింది. చివరి వరకు శ్రమించినా ఫలితం తారుమారైంది. ఉత్కంఠ పోరులో భారత్‌పై పాక్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అండర్‌ 19 ఆసియాకప్‌లో భాగంగా భారత్‌, పాక్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌ 49 ఓవర్లో 237 పరుగులకు ఆలౌటైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఛేదనలో పాక్‌ సరిగ్గా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది.

238 పరుగుల లక్ష్యంతో పాక్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. తొలి ఓవర్‌ రెండో బంతికే వికెట్‌ నష్టపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ముహమ్మద్‌ షెహజాద్‌ (81) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇర్ఫాన్‌ ఖాన్‌ (32), రిజ్వాన్‌ మహమ్మద్‌ (29) ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. భారత బౌలర్‌ రాజ్‌ భవా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఆఖరి రెండు ఓవర్లో పాక్ విజయానికి 18 పరుగులు చేయాల్సి వచ్చింది. రవి కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికే జీషన్‌ జమీర్‌ ఔటయ్యాడు.

దీంతో ఐదు బంతుల్లో 8 పరుగులు చేయాలి. తర్వాతి రెండు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు, ఐదు బంతులకు అహ్మద్‌ ఖాన్‌ రెండు డబుల్స్ తీశాడు. చివరి బంతికి ఫోర్ బాది విజయం ఖరారు చేశాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నుంచి వికెట్ కీపర్‌ ఆరాధ్య యాదవ్‌ (50: 83 బంతుల్లో 3×4), కౌషల్ తంబే (32: 38 బంతుల్లో 4×4) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన రాజవర్థన్‌ (33: 20 బంతుల్లో 5×4,1×6) ధాటిగా ఆడాడు. దీంతో భారత్ 237 పరుగులు చేయగలిగింది.

Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?

యాషెస్ సిరీస్ జరుగుతుండగా బాధాకరమైన వార్త.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మరణించాడు..

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?