Boxing Day Test Match: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి?.. పూర్తి చరిత్ర తెలుసుకోండి..
డిసెంబర్ 26వ తేదీ వచ్చినప్పుడల్లా క్రికెట్‌లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లతో సందడి నెలకొంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లు క్రిస్మస్ మరుసటి రోజు అంటే డిసెంబర్ 26 నుంచి వస్తాయి...
డిసెంబర్ 26వ తేదీ వచ్చినప్పుడల్లా క్రికెట్‌లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లతో సందడి నెలకొంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లు క్రిస్మస్ మరుసటి రోజు అంటే డిసెంబర్ 26 నుంచి వస్తాయి. అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన టెస్ట్ మ్యాచ్‌లు ఆడే సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, బాక్సింగ్ డే అంటే ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బాక్సింగ్ డే గురించి ఇప్పుడు తెలుసుకుంద్దాం. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే టెస్టు అత్యంత ప్రసిద్ధ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌గా పరిగణిస్తారు.
గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడాతో సహా అన్ని కామన్వెల్త్ దేశాలలో క్రిస్మస్ తర్వాత రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లు అంటారు. ఈసారి బాక్సింగ్ డే నుంచి రెండు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఒకటి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగుతున్న యాషెస్ సిరీస్ మ్యాచ్. సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.
బాక్సింగ్ డే అంటే ఏమిటి
బాక్సింగ్ డే అంటే ఏమిటి, ఈ పేరు ఎక్కడ నుండి వచ్చింది అనే దాని గురించి కొన్ని కథనాలు ఉన్నాయి. చర్చిలో ఉంచిన పెట్టెలు క్రిస్మస్ మరుసటి రోజున తెరుస్తారు. అందుకే ఈ రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు. క్రిస్మస్ రోజున చాలా మంది ప్రజలు అవసరమైన వారి కోసం చర్చిలో కొన్ని బహుమతులు ఉంచుతారు. ఈ గిఫ్ట్ బాక్సులను మరుసటి రోజు తెరిచి అవసరమైన వారికి అందజేస్తారు. ఈ రోజు గురించి మరొక కథనం ఏమిటంటే, క్రిస్మస్ రోజున సెలవు లేకుండా పని చేసే వారికి మరుసటి రోజు ఒక పెట్టె రూపంలో బహుమతి ఇస్తారు. అందుకే దీన్ని బాక్సింగ్ డే అంటారు.
మొదటి బాక్సింగ్-డే టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
బాక్సింగ్-డే టెస్ట్ మ్యాచ్ 1950లో ప్రారంభమైంది. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలినాళ్లలో అయితే ప్రతి సంవత్సరం ఆడేవారు కాదు. 1952లో దక్షిణాఫ్రికా తన మొదటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత 1968లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడారు. ప్రతి సంవత్సరం దీనిని ఆడే సంప్రదాయం 1980 నుండి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు నిరంతరం బాక్సింగ్-డే టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నాయి.
1985లో ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడింది. అది డ్రాగా ముగిసింది. భారత్, దక్షిణాఫ్రికా 1992 నుంచి ఐదు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి, వీటిలో దక్షిణాఫ్రికా నాలుగు విజయాలు సాధించింది.
Read Also.. IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్.. తుది జట్టులో చోటు దక్కేది ఎవరికో..