IND vs SA: భారత్ పేస్ దళం బలంగా ఉంది.. టెస్ట్ సిరీస్‎లో వారిదే పై చేయి..

దక్షిణాఫ్రికాలో జరిగే టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఆదివారం నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది....

IND vs SA: భారత్ పేస్ దళం బలంగా ఉంది.. టెస్ట్ సిరీస్‎లో వారిదే పై చేయి..
India Bowling
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 26, 2021 | 11:48 AM

దక్షిణాఫ్రికాలో జరిగే టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఆదివారం నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ సహా చాలా మంది ఆటగాళ్లు తమ సొంత మైదానంలో భారత్ కంటే పటిష్ట స్థితిలో ఉన్నామని పదే పదే చెబుతున్నారు. అయితే, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ అలీ బాచర్ అలా భావించడం లేదు. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియాదే పైచేయి అని వివరించాడు.

దక్షిణాఫ్రికాకు పెట్టని కోటగా భావించే సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్స్ పార్క్‌లో సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. 1995లో ఈ మైదానంలో భారత జట్టు తొలి టెస్టు ఆడింది. అప్పటి నుంచి ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. అయితే ఈసారి దక్షిణాఫ్రికాకు విజయం అంత సులువు కాదని అలీ బచర్ చెప్పాడు.

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 101, షమీ 195, సిరాజ్ 33, ఇషాంత్ శర్మ 311 వికెట్లు తీశారు. గత నాలుగేళ్లలో ఈ బౌలర్లు భారత్‌కు ఎన్నో టెస్టు మ్యాచ్‌లు, సిరీస్‌లలో చారిత్రాత్మక విజయాలను అందించారు. ముఖ్యంగా విదేశాల్లో జట్టు విజయంలో ఈ బౌలర్లు హీరోగా నిలిచారని అలీ బచార్ అన్నారు. “భారత్ సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో ఉన్న సెంచూరియన్‌లో మొదటి టెస్ట్ ఆడబడుతుంది. జోహన్నెస్‌బర్గ్ 6000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశాల వాతావరణం, ఫాస్ట్ బౌన్స్ ఫాస్ట్ బౌలర్లకు సహాయపడతాయి. ప్రస్తుత భారత జట్టు గత 30 ఏళ్లలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ బృందాన్ని కలిగి ఉంది.అందుకే తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌దే పైచేయి అవుతుందని భావిస్తున్నాను.” అని బచార్ వివరించాడు.

వైస్ కెప్టెన్ KL రాహుల్ కూడా నాల్గవ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఆడతాడని హింట్ ఇచ్చాడు. ‘టెస్ట్ మ్యాచ్ గెలవడానికి ప్రతి జట్టు 20 వికెట్లు తీయాలని కోరుకుంటుంది. మేము ఈ వ్యూహాన్ని కూడా ఉపయోగిస్తామని రాహుల్ చెప్పాడు.

Read Also..IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్.. తుది జట్టులో చోటు దక్కేది ఎవరికో..