AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Apple: సీతాఫలం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. లాభాల కంటే నష్టాలే ఎక్కువట..! అవేంటో తెలుసుకోండి

Wild sweetsop disadvantages: పిల్లలతోపాటు.. అందరూ ఇష్టపడే పండ్లల్లో సీతాఫలం ఒకటి. ఇది రుచితోపాటు.. శరీరానికి అనేక విధాలుగా

Sugar Apple: సీతాఫలం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. లాభాల కంటే నష్టాలే ఎక్కువట..! అవేంటో తెలుసుకోండి
Sugar Apple
Shaik Madar Saheb
|

Updated on: Dec 27, 2021 | 7:36 AM

Share

Wild sweetsop disadvantages: పిల్లలతోపాటు.. అందరూ ఇష్టపడే పండ్లల్లో సీతాఫలం ఒకటి. ఇది రుచితోపాటు.. శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా.. పలు సమస్యలతో బాధపడుతున్నా సీతాఫలాన్ని తీనిమని నిపుణులు సలహా ఇస్తుంటారు. సీతాఫలంలో కాపర్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఈ పోషకాలన్నీ శరీరానికి అవసరం కావున సీజనల్‌గా వచ్చే సీతాఫలాన్ని ఏదో ఒక సమయంలో తినాలంటూ వైద్యులు, నిపుణులు సూచిస్తుంటారు.

అయితే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. సీతాఫలం శరీరానికి అనేక విధాలుగా హాని చేస్తుందని మీకు తెలుసా. ఇది శరీరానికి మంచిదని భావించినప్పటికీ.. ఇది అనేక సమస్యలను తెస్తుందంటున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజులో ఒక సీతాఫలం మాత్రమే తినాలి. ఎక్కవగా తింటే పలు అనార్ధాలు తప్పవంటున్నారు నిపుణులు. అయితే.. సీతాఫలం ఎక్కువగా తినడం వల్ల కలిగే ఆరోగ్యానికి సంబంధించిన హాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దురద – అలెర్జీలు సీతాఫలం ఆరోగ్యానికి మంచిదని.. దీనిని తినాలని సలహా ఇస్తారు. కానీ దీనిని తినడం వల్ల చాలా మందికి అలెర్జీలు లేదా దురద, చర్మ సమస్యలు తలెత్తవచ్చు. మీరు సీతాఫలాన్ని తిన్న తర్వాత మీకు అలెర్జీ లేదా దురద వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే తినడం మానేయాలి. ఇది మాత్రమే కాదు.. ఇప్పటికే అలెర్జీ సమస్య ఉన్నవారు సీతాఫలానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు నిపుణులు.

ఉదరం సమస్యలు సీతాఫలం వల్ల చాలా మందికి కడుపు సమస్యలు వస్తుంటాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని అస్సలు తినకూడదు. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. సీతాఫలాన్ని అధికంగా తింటే మీరు కడుపు నొప్పి, పేగుల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

వాంతి – వికారం సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీరు సీతాఫలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు వికారం సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సీతాఫలాన్ని రోజుకు ఒకసారి మాత్రమే అది కూడా ఒక్కటి మాత్రమే తినాలి.

బరువు పెరుగుతుంది సీతాఫలంలో కేలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కేలరీలు సహజంగా బరువు పెరగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సీతాఫలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా బరువు పెరిగే సమస్య మొదలవుతుందంటున్నారు నిపుణులు.

Also Read:

ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా ? ఇక మీ పని అంతే.. ఎందుకో తెలుసుకోండి..